*పేదల ఇళ్ల స్థలాలను కబ్జా చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు*
పేదల ఇళ్ల స్థలాలను అక్రమంగా బీఆర్ఎస్ నాయకులు కబ్జా చేస్తున్నారని డా.వంశీకృష్ణ ఆరోపించారు.
గురువారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బల్మూర్ మండలం చెన్నారం గ్రామంలో పేదల బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన ఇండ్ల స్థలాలను ఎమ్మెల్యే అనుచరులు టిఆర్ఎస్ నాయకులు కబ్జా చేస్తున్నారని డిసిసి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆరోపించారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా చెన్నారం గ్రామంలో ఆక్రమణకు గురైన భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల ఇళ్ల స్థలాల కోసం చెన్నారం గ్రామంలో 140 సర్వే నెంబర్ లో 6 ఎకరాల 36 గుంటల భూమినీ ప్రభుత్వం కొనుగోలు చేసిందని తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 2005 అప్పట్లో మంత్రి గొల్లపల్లి సూర్యారావు ద్వారా సర్టిఫికెట్లు అందజేసినట్లు తెలిపారు.పేదలకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన భూమిని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అనుచరులు కబ్జాలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. పేదల ఇంటి నిర్మాణం కోసం కొనుగోలు చేసిన భూములు అధికార పార్టీ అండదండలు ఎమ్మెల్యే ప్రోత్సాహంతోనే కబ్జాకోరులు ప్రభుత్వ భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారని ఇది ఎంతవరకు సమంజసం అని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టకపోగా ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇంటి స్థలాలను కబ్జా చేయడం చాలా దారుణంగా ఉందని, స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అండదండలతో అనుచరులు నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు పేదల భూములు కబ్జా చేస్తున్నారని రానున్న రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం కాయమని అన్నారు.
పేదలకు పంపిణీ చేసిన ప్రభుత్వ భూమిని ఇతరులకు అమ్మితే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఆయన హెచ్చరించారు.రెవెన్యూ అధికారులు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా చూడాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలలో ఒక పేదవాడికి కూడా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వలేదని గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన స్థలాలను అమ్మేందుకు సిద్ధమవుతున్నారని ఈ విషయంలో లబ్ధిదారులు తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వెంకట్ రెడ్డి నాయకులు శ్రీపతిరావు సుధాకర్ గౌడ్, కాశన్న యాదవ్ జంగయ్య రాంప్రసాద్ గౌడ్ మల్లేష్ గోపాల్ రెడ్డి అనంతరెడ్డి వివిధ మండలాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.