పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
ఇందూరు వార్త జనవరి 14 ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో
స్థానిక మండల ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో 2004-5లో పదోతరగతి చదివిన వారంతా ఆదివారం కలుసుకున్నారు. పాతజ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా ఆనాటి తమ ఉపాధ్యాయులయిన , శ్రీనివాస్ ,రాఘవరావు , సుబ్బారావులను సత్కరించిన పూర్వ విద్యార్థులు
మందలపల్లి 12: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లి స్థానిక మండల ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో 2004-5 పదోతరగతి చదివిన వారంతా ఆదివారం కలుసుకున్నారు. పాతజ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా ఆనాటి తమ ఉపాధ్యాయులు శ్రీనివాస్ ,రాఘవరావు , సుబ్బారావులను ఘనంగా సత్కరించి, వారి ఆశీర్వదాలు తీసుకున్నారు. సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ 20 ఏళ్ల క్రితం చదివినవారంతా ఇప్పుడు సమ్మేళనం నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం కేక్ కట్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు అంజలీదేవి,తులసి,గాయత్రి,అంజలి,రమాదేవి,ఉమాదేవి,మహేశ్వరి,సౌజన్య,శ్రీలత,గంగా,మాధవి,నాగిని,బాలాజీ,సోమరాజు,శ్రీనివాస్,కార్తీక్,రాజేష్,మారేష్,బాలకృష్ణ,వేంకటేశ్వరరావు,ప్రసాద్,శివాజీ,జాన్-పాషా,నరసింహారావు,రవి,మనోజ్ కుమార్,కృష్ణమహేష్,సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.