ఇందూర్ వార్త (వెబ్ న్యూస్)
పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసిన మచారెడ్డీ ముదిరాజులు
మచారెడ్డి మండలం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం
ముదిరాజ్ కులాన్ని తీవ్రమైన అనుచిత వ్యాఖ్యలతో దూషించిన పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మని భారీ ఊరేగింపుగా తీసుకెళ్లి స్థానిక మచరెడ్డి x రోడ్ సెంటర్లో తగలబెట్టడం జరిగింది
ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం నాయకులు పిట్ల కృష్ణం రాజు మాట్లాడుతూ ఖబర్దార్ పాడి కౌశిక్ రెడ్డి అగ్రకుల దురహంకారంతో ముదిరాజ్ జాతిని తీవ్ర పదజాలంతో తిట్టిన నీవు ముదిరాజ్ జాతికి బేషరతుగా క్షమాపణలు చెప్పకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 60 లక్షల మంది ముదిరాజులు నిన్ను రోడ్లమీద తిరగనియ్యమని ముదిరాజుల ఆగ్రహానికి గురికాక తప్పదని వారు హెచ్చరించారు
అలాగే సీఎం కేసీఆర్ కూడా తెలంగాణ ఉద్యమ ద్రోహి అయిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిని పదవి నుంచి పార్టీ నుంచి వెంటనే తొలగించి ముదిరాజుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని ఈ సందర్భంగా వారు కోరారు, ఈ కార్యక్రమంలో మాచారెడ్డి మండల మండల అధ్యక్షుడు పిట్ల కృష్ణంరాజు, కుల సంఘ సభ్యులు పుట్టకుక్కల అంజయ్య పిట్ల దేవరాజ్ ఏనుగు దేవరాజ్ పిట్ల శ్రీనివాస్, సుతారి నారాయణ ,సత్యనారాయణ, ఏనుగు లక్ష్మణ్ ,సతీష్, నరేష్ ,నారాయణ, వెంకటి ,లక్ష్మణ్, నర్సింలు ,శ్రీశైలం, శీను, బిక్షపతి కుల సంఘ సభ్యులుకమిటీ సభ్యులు, యూత్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.