పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని
ఇందూర్ వార్త నవంబర్ 2ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతి నిధి
పాల్గొన్న టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు
కొత్తగూడెం ( ) సుజాతనగర్ మండలం డేగలమడుగులోని జన్నీంగ్ మిల్లులో సీసీఐ ద్వారా ప్రత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు పాల్గొన్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతు తేమ శాతం ద్వారా పత్తి గిట్టుబాటు ధర నిర్ణయించబడుతుందని, సీసీఐ కొనుగోలు కేంద్రంలో ప్రయివేట్ వ్యాపారులను ప్రోత్సాహించవద్దని, సీసీఐ బయ్యర్ మాత్రమే మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలనీ కోరారు. రైతులు తేమ శాతం తక్కువ ఉండేలా చూసుకొని ప్రభుత్వ మద్దతు ధర పొందాలన్నారు. ఈ క్రమంలో రైతులకు ఎటువంటి నష్టం చేసిన వారి కోసం పోరాటం చేసేందుకు ఎమ్మెల్యే తో పాటుగా కాంగ్రెస్ నేతలు సిద్ధంగా ఉంటామని సీసీఐ కేంద్ర నిర్వాహకులు నిష్పక్షపాతంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీఎంస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాస్, సోసైటీ చైర్మన్ మండే వీర హనుమంత్ రావు, మాజీ ఏఎంసీ చైర్మన్ భూక్యా రాంబాబు, సుజాతనగర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు చింతలపూడి రాజశేఖర్, సిపిఐ మండల కార్యదర్శి భూక్యా దస్రు, అధికారులు, అనధికారులు, రైతులు, కాంగ్రెస్, సిపిఐ నాయకులు కార్యాకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.