పంటను నాశనం చేసిన దుండగులు
ఇందూర్ వార్త నవంబర్ 11 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి
· తొత్తులుగా మారుతున్న అధికారులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పెద్ద గొల్లగూడెం గ్రామంలో 70 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నాటువంటి మారుతి రామారావు అనే రైతు తన పొలాన్ని ఈరోజు కొంత మంది ఇతర కులస్తులు వచ్చి అధికారుల సహకారంతో తన పంట పొలాన్ని దున్ని,పంటనునాశనం చేసి తనను బెదిరించడం జరిగిందని బాధితులు మీడియాకు తెలపడం జరిగినది,ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుడు 70 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నటువంటి పొలాన్ని ఇతర కులస్తులు చెప్పిన మాటలు నమ్మి అధికారులు వారికి తొత్తులుగా మారి పంట పొలం నాశనం చేయటం ఎంతవరకు సమంజసం అని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై ఐటీడీఏ పీవో మరియు జిల్లా కలెక్టర్ స్పందించి మాకు న్యాయం చేయగలరని బాధితులు వాపోయారు
స్థానిక ఎస్సై ని వివరణ కోరగా కోర్టు నుంచి ఎవరు నోటీసులు తెచ్చుకున్న ప్రొటెక్షన్ కల్పిస్తామని అందులో మా ప్రమేయం ఏం లేదని తెలిపారు