పంచాయతీ లో అవకతవకల మీద
సీ సీ ఆర్ రిపోర్ట్ కలెక్టర్, డీపీవో కి అందజేత
ఇందూర్ వార్తా ప్రతినిధి కామారెడ్డి
నాగుల్ గావ్ గ్రామపంచాయతీలో అవకతవకలు జరుగుతున్నాయని గ్రామస్తులు కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ (సీసీఆర్) సంస్థను సంప్రదించారు. దీనిపై స్పందించిన సీసీఆర్ సభ్యులు రికార్డు వెరిఫికేషన్ నిర్వహించారు. తనిఖీలలో అనేక లోటుపాట్లు కనిపించాయి. నాగుల్ గావ్ గ్రామపంచాయతీలో ఉండాల్సిన రిజిస్టర్లలో సగం కంటే ఎక్కువ రిజిస్టర్లు లేవని పంచాయతీ సెక్రటరీ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. లభించిన రిజిస్టర్లలో అనేక తప్పులు క్షుణంగా పరిశీలించారు.
సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా గత 10 సంవత్సరాల రికార్డులను పరిశీలించాలని కోరినా, కేవలం 3-4 సంవత్సరాల రికార్డులు మాత్రమే లభించాయి. పైగా, లభించిన రిజిస్టర్ల నిర్వహణ సరిగ్గా లేవు . ఈ వివరాల ఆధారంగా CCR డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యులు ఫైనల్ రిపోర్ట్ రూపొందించి, ఈరోజు కామారెడ్డి జిల్లా కలెక్టర్, డిపిఓ గార్లకు అందజేశారు.
ఎక్కడైనా అవకతవకలు గమనించినపుడు, ఎవరైనా కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్‌ను సంప్రదిస్తే వారికి మా సంస్థ నుండి పూర్తి సహాయ సహకారాలు అందించబడతాయి.
కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ సంస్థ ద్వారా ఆర్టీఐ చట్టానికి సంబంధించి పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది.
ఈ కార్యక్రమంలో CCR కేంద్ర డ్రాప్టింగ్ కమిటీ సభ్యుల నేవూరి రత్నాకర్, చరణ్ కాంత్, గుండ్ల శివచంద్రం, కరీముద్దీన్ స్టేట్ సెక్రెటరీ ఉత్తర తెలంగాణ జోన్-1 సిసిఆర్ ఉమ్మడి జిల్లా ప్రతినిధులు B. శ్రావణ్ కుమార్ జిల్లా ఇన్చార్జి, వసంత్ జాదవ్, కేతి మల్లికార్జున్, షేక్ ముజీబ్, నయీమ్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.
..