నూతన గ్రామపంచాయతీ భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జారె
ఇందూర్ వార్త ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి జనవరి 6
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
అశ్వారావుపేట మండలంలో మద్దికొండ, నారంవారిగూడెంకాలనీ, అల్లిగూడెం, అశ్వారావుపేట గ్రామపంచాయతీలలో 40 లక్షల వ్యయంతో నిర్మించిన నాలుగు నూతన గ్రామపంచాయతీ భవనాలను ప్రారంభించారు.
అల్లిగూడెం గ్రామపంచాయతీ నిర్మాణానికి స్థలాన్ని దానం చేసిన మొడియం నరసింహులు కుటుంబాన్ని ప్రత్యేకంగా అభినందించారు.
మద్దికొండ, కొత్తనారంవారిగూడెం గ్రామాలలో ప్రభుత్వం మంజూరు చేసిన సీసీ రోడ్లనిర్మాణానికి భూమిపూజచేసారు
మొద్దులగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నూతన ప్రహరీగోడ నిర్మాణానికి శంకుస్థాపన చేసి పాఠశాల విద్యార్థులకు లైబ్రరీ బుక్స్ అందించారు గ్రామస్తులు గతంలో రచ్చబండ కార్యక్రమంలో కొత్తగా కరెంట్ లైన్ కావాలని ఎమ్మెల్యే కి తెలుపగా నిధులు మంజూరు చేశామన్నారు వారం రోజుల్లో అవసరం అయిన చోట విద్యుత్ లైన్లు ఏర్పాటు చేస్తామన్నారు పాతనారంవారిగూడెం గ్రామంలో శిధిళావస్థలో ఉన్న అంగన్వాడీ భవనం పరిశీలించి త్వరలో నూతన భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు అనంతరం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించి వసతులు పరిశీలించారు , అల్లిగూడెం గ్రామంలో కరెంట్ స్తంబాలు రోడ్డు మధ్యన ఉండటంతో వెంటనే పక్కకు మార్చి గ్రామస్థులకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో తాసిల్దార్ష్ణప్రసాద్ ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ , ఆర్ డబ్ల్యు ఎస్ ఏ ఈ సతీష్ కుమార్ , ఆర్ఐ కృష్ణ పద్మావతి పంచాయతీ సెక్రటరీలు
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తుమ్మా రాంబాబు జూపల్లి రమేష్ జేష్ఠ సత్యనారాయణ చౌదరి మొగళ్లపు చెన్నకేశవరావు, జూపల్లి ప్రమోద్, సి ఐ కరుణాకర్ , యయాతి రాజు ,ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు…