నిరుపేదలకు వంట సామగ్రి, బ్లాంకెట్లు అందజేత
ఇందూర్ వార్త
బాన్సువాడ రూరల్ : డిసెంబర్ 27
బీబీపేట్,డిసెంబర్:28 బీబీపేట్ మండలం కేంద్రంలో మంగళవారం రోజున ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా వైస్ చైర్మన్ అంకన్నగారి నాగరాజ్ గౌడ్ ఎవరులేని నలుగురు నిరుపేదలకు వంట సామాను, బ్లాంకెట్లు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా నిరుపేదలకు తమ వంతు సహాయ సహాయకారాలు అందిస్తు అండగా నిలుస్తున్నామన్నారు జిల్లా వ్యాప్తంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వ నమోదు నిరంతరం కొనసాగుతుందన్నారు ప్రతి ఒక్కరు రెడ్ క్రాస్ సొసైటీలో సభ్యత్వం పొంది,పలు సేవా కార్యక్రమాలలో భాగస్వామ్యం పంచుకోవాలన్నారు ముఖ్యంగా యువత రక్తదానానికి ముందుకు రావాలని కోరారు ఇట్టి కార్యక్రమంలో రెడ్ క్రాస్ మండల చైర్మన్ బాశేట్టి నాగేశ్వర్,సర్పంచ్ తేలు లక్ష్మీ సత్యనారయణ,ఎంపీటీసీలు దుంప పల్లవి భూమేష్, కొరివి నీరజ నర్సింలు,మండల రెడ్ క్రాస్ వైస్ ఛైర్మన్ పిడుగు స్వామి,మాజీ ఎంపిటిసి పంపరి శివరాజం,మండల రెడ్ క్రాస్ కమిటీ సభ్యులు డాక్టర్ రమేశ్ రాజు, వెంకట్రాంరెడ్డి, సాయి, వీరు,ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.