ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు
నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి సునితా లక్ష్మారెడ్డి చాదర్ ఫూల్ దట్టి సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు,
మొన్న 2023 నవంబర్ జరిగిన శాసన సభ ఎన్నికల్లో.. నర్సాపూర్ శాసన సభ్యులు గా సునితాలక్ష్మారెడ్డి ఎన్నికైతే బడీ పహాడ్ వెళ్లి క్రింది నుండి 500మెట్లు మోకాళ్ళపై వస్తానని గోమారం కు చెందిన రైతు నర్సింహారెడ్డి మొక్కుకోడం జరిగింది.
ఈ సందర్భంగా సునితా లక్ష్మారెడ్డి ఘన విజయం సాధించిన తరుణంలో నేడు మొక్కుతీర్చుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి సునితాలక్ష్మారెడ్డి హాజరై దర్గా లో ప్రార్థన చేసి చాధర్… దట్టి ఫూల్ ఎక్కించి ఫాత్యాల్ యివ్వడం జరిగింది,
ఈ కార్యక్రమానికి నర్సాపూర్ నియోజకవర్గం నుండి బీఆర్ ఎస్ పార్టీ నాయకులు పెద్ద యెత్తున తరలి వెళ్ళడం జరిగింది.. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాజీ జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మెన్ చంద్రా గౌడ్,జిల్లా జెడ్పీ కో – ఆప్షన్ సభ్యులు మన్సూర్,యువ నాయకులు వాకిటి శశిధర్ రెడ్డి ,ఎంపీపీ కల్లూరి హరిక్రిష్ణ, జెడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్త,సంతోష్ మేఘమాల,ఆంజనేయులు,అమర్ సింగ్ , మాజీ ఆత్మ కమిటి ఛైర్మెన్ గొర్రె వెంకట్ రెడ్డి, దుర్గప్ప గారి సత్యంగౌడ్,మాజీ జెడ్పీటీసీ చౌటి జగదీష్ ,తొంట వెంకటేష్ , మాధవ రెడ్డి, బిక్షపతి రెడ్డి, మర్రి మహేందర్ రెడ్డి ,సర్పంచ్ గైని బైటి శ్రీనివాస్ గౌడ్,ఏనుగు అశోక్ రెడ్డి , రవి కుమార్,పెద్దపులి రవి, మనోహర్ రెడ్డి, వెంకట్ గౌడ్ ,జితేందర్ రెడ్డి ,గౌరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ,ఎల్లమయ్య చంద్రకళ శ్రీశైలం యాదవ్ , ఎంపీటీసీ గుంజరి ప్రవీణ్ కుమార్, విషు రెడ్డి, గూడూరు యాదా గౌడ్, వాకిటి హాన్మంతు రెడ్డి, కో -ఆప్షన్ లాయాక్ షేక్ , చింత స్వామి,బీఆర్ ఎస్ కే వీ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరేశం ,ఉసిరిక పల్లి ఆంజనేయులు,మహిపాల్ రెడ్డి, సింగిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాణయ్య,జగుపతి వివిధ గ్రామాల మాజీ సర్పంచ్ లు ఎంపీటీసీ సభ్యులు, ప్రజా ప్రతినిదులు కార్యకర్తలు అభిమానులు హాజరుకావడం జరిగింది