ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు
మెదక్ జిల్లా నర్సపూర్ మున్సిపాలిటీ పరిధిలో విగ్నేశ్వర్ కాలనీ యందు ఒక వ్యక్తి తన ఇంటిలో అక్రమంగా ఎండు గంజాయి నిల్వఉంచి అమ్ముతున్నాడని విశ్వసనీయమైన సమాచారం మేరకు, ఏడ్ సూపరిడెంట్, మెదక్ జిల్లా గారి ఆధ్వర్యంలో జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ వారు తమ సిబ్బందితో, అట్టి ఇంటిలో విస్తృత తనిఖీలు నిర్వహించగా అతడి వద్ద నుంచి 2.035 kg ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు పేరు మహమ్మద్ సమీరొద్దిన్, తండ్రిపేరు : షర్ఫొర్దిన్, మ॥ంసం॥గా గుర్తించి అతని పై NDP5 చట్ట ప్రకారం కేసు నమోదు చేసి, రిమాండ్కు తరిలించినట్లు నర్సపూర్ ఎక్సైజ్ CI. తెలిపారు. ఇట్టి తనిఖీల్లో టాస్క్ ఫోర్స్ CI నరెందర్, సిబ్బంది చంద్రయ్య, ఎల్లయ్య, హరీష్, నవీన్, నరేష్ మరియు పాల్గొన్నారు