ఇందూర్ వార్త ప్రతినిధి రాజు
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గమైన పట్టణ కేంద్రంలోని బి వి ఆర్ ఐ టి కళాశాలలో వాహన పోటీలను నిర్వహించడం జరిగింది.
విష్ణు విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ లక్ష్మీప్రసాద్
ఇంజనీరింగ్ విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించడానికి ఈ బజాజ్ సైన్దియా పేరుతో ఎలక్ట్రిక్ విద్యుత్ వాహన పోటీలను నిర్వహిస్తున్నట్లు విష్ణు విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ లక్ష్మీప్రసాద్ అన్నారు. బుధవారం నర్సాపూర్ సమీపంలోని బి.వి.ఆర్.ఐ.టి ఇంజనీరింగ్ కళాశాలలో ఈ బజాజ్ సైన్టియా పేరుతో విద్యుత్ ఎలక్ట్రిక్ వాహన పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సాపూర్ బివిఆర్ఐటి కళాశాలలో మొదటిసారిగా ఇటువంటి పోటీలు నిర్వహించడం అందులో, మెదక్ జిల్లా నర్సాపూర్ బి.వి.ఆర్.ఐ.టి ఇంజనీరింగ్ కళాశాల వేదిక కావడం సంతోషకరమన్నారు. పోటీలకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 70 టీములు 2019 విద్యార్థులు పాల్గొంటారని ఆయన చెప్పారు. ఒక టీం లో 25 మంది చొప్పున ఉంటారని 6 నుంచి 11వ తేదీ వరకు జరిగే పోటీలలో విద్యార్థులు తమ తయారుచేసిన వాహనాలను ప్రదర్శించి పాల్గొంటారని తెలిపారు. 10.11వ తేదీలలో ప్రతిభ చూపిన
విద్యార్థుల ను గుర్తించి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులు తయారుచేసిన ఎలక్ట్రిక్ విద్యుత్ వాహనాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో విష్ణు గ్రూప్ ఆఫ్ ఇన్ని ట్యూట్ సెక్రెటరీ డాక్టర్ సంజయ్ విబందే, రెనాల్ట్ నిస్సాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ హీరా టోకే, ఇన్నోవేషన్ హీరో మోటార్ క్రాఫ్ట్ సీనియర్ మేనేజర్ మనీష్ సింగల్, ఈ బజా సైనియా పోగ్రామ్ కన్వీనర్ మోనిష్ నాగేంద్రన్, బి.వి.ఆర్.ఐ.టి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సంజయ్ రుటీ, మేనేజర్ బాపిరాజు, ఏవోలు అశోక్ రెడ్డి సురేష్ తదితరులు