ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు
నర్సాపూర్ పట్టణ కేంద్రంలోని అక్షర ది ప్లానెట్ స్కూల్ లో నర్సాపూర్ లో విద్యార్థులు స్వతహాగా చేసిన బతుకమ్మలతో దసరా నవరాత్రి ఉత్సవాల్లో ముందుగానే అంగరంగ వైభవంగా జరుపుకున్నారు ఆటపాటలతో విద్యార్థులు నృత్యాలు చూడముచ్చటగా కనువిందు చేశాయి తెలంగాణ సాంప్రదాయబద్ధంగా బతుకమ్మ సంబరాలను అక్షర స్కూల్లో నిర్వహించడం జరిగింది.
పాఠశాలలో విద్యార్థిలతో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణ కేంద్రంలో గురువారం రోజు బతుకమ్మ సంబరాలు, ఉపాధ్యాయుల విద్యార్థినీయుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు రాష్ట్రం
ఏర్పాటు అయినప్పటినుండి ఆడపడుచులకు చాలా సంతోషకరంగా జరుపుకునే పండగ, తెలంగాణ రాష్ట్రం ఆడపడుచుల బతుకమ్మ పండుగా గుర్తించి
తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ ఆడపడుచులు ఎంతో రుణపడి ఉన్నారు గత ప్రభుత్వాలలో మన తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ సంబరాలను చేసుకోవాలంటే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనే వారు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ప్రతి ఇంటి ఆడపడుచు బ్రతుకమ్మ పండుగ అంటే ఏమిటో అని తెలుసుకున్నా ఆడపడుచులు ఎంతో ఘనంగా బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నారు ఆ ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుందని వారు తెలియజేశారు రానున్న రోజుల్లో కూడా ఇలానే తెలుగంటి ఆడపడుచులు ప్రతి బతుకమ్మ పండుగకు ఎంతో ఘనంగా సంబరాలు జరుపుకోవాలని కోరుకుంటున్నామని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అక్షర ది ప్లానెట్ స్కూల్ కరెస్పాండెంట్ నల్లగండ్ల అశోక్ కుమార్ మరియు ప్రిన్సిపల్ రాశి టీచర్ స్రవంతి మహిళా టీచర్ విద్యార్థులు పాల్గొనడం జరిగింది