ఇందూర్: వార్త, సెప్టెంబరు10 మంగళవారం
జెడ్పీఎస్ఎస్ నడికుడ పాఠశాలలో చాకలి ఐలమ్మ వర్ధంతి ఘనంగా జరిగింది .ఇదే రోజున జడ్పీఎస్ఎస్ ప్రధానోపాధ్యాయులు హనుమంతరావు సర్ మరియు ఫిజికల్ డైరెక్టర్ శివకుమార్ సార్ గారికి బెస్ట్ టీచర్ గా సన్మానం చేయడం జరిగిన సమావేశంలో నడి కూడ మండల ఎమ్మార్వో నాగరాజు ఎంపీడీవో సార్ హాజరు కావడం జరిగింది .ఈ సమావేశ సందర్భంగా ప్రాథమిక పాఠశాలలో నాలుగవ తరగతి చదువుతున్న ఎస్. డి .సాఫీయా ఉపాధ్యాయులను సంబోధిస్తూ మంచి పాట పాడడం జరిగింది. సఫియా వేదికపై వచ్చి ధైర్యంగా అర్థవంతమైన పాటను పాడి అందరినీ ఆశ్చర్యపరిచింది. సాఫియాను మెచ్చుకున్న నడికుడ మండల్ ఎమ్మార్వో నాగరాజు అమ్మాయిని అభినందించి పదో తరగతి వరకు ఈ అమ్మాయిని నేను చదివిస్తానంటూ అమ్మాయిని అడాప్ట్ చేసుకోవడం జరిగింది .ఈ సందర్భంగా ఎమ్మార్వో గారిని సమావేశానికి వచ్చిన అందరూ అభినందనలు తెలిపారు. అమ్మాయికి ఈ పాటను నేర్పించిన పోరిక రాజు నాయక్ సార్ గారిని కూడా అందరూ అభినందించడం జరిగింది. ఇలా పేద పిల్లలను ప్రోత్సహించడం ఎమ్మార్వో గారి దయ గుణానికి నిదర్శనమని అందరూ కొనియాడారు. ఈ సన్మాన సమావేశంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి శ్రీ కృపమ్మ మేడం , అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ శ్రీమతి శ్రీ స్రవంతి శ్రీ దొంతుల శ్రీనివాస్ సార్ పారేపల్లి జై మేడం లావుడియా శివ చేతన్ సార్ ,రాయకండి సుమలత మేడం దాసరి శ్రావణ్ కుమార్ సార్ గొట్టిముక్కల శ్రీనివాస్ రెడ్డి సార్ నన్నే బోయిన తిరుపతి సార్ ,మహమ్మద్ సుభాని, సార్ రంపిస శివకుమార్ సార్ మరియు ప్రాథమిక పాఠశాల జిల్లెల కుమారస్వామి సార్ విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది