పేదల ఆరోగ్య సేవలకు పెద్ద పీఠ
దోమకొండ లో అల్ట్రా సౌండ్ స్కానింగ్ ప్రారంభం
(ఇందూరు వార్త)
దోమకొండ, డిసెంబర్ 20
పేదల ఆరోగ్య సేవలకు తెలంగాణ లో కేసీఆర్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని ప్రభుత్వ విప్ కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు దోమకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో అల్ట్రా సౌండ్ స్కానింగ్ మిషన్ మంగళ వారం ప్రారంభంచారు ముఖ్యమంత్రి కేసీఆర్ హాయంలో పేదల ఆరోగ్య సేవలకు, గర్భిణీ స్త్రీలకు మెరుగైన వైద్యం, రోగాల నిర్దారణ కు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తెలిపారు.
కామారెడ్డి లో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు సకల ఏర్పాట్లు పూర్తి చేయాలనీ కోరారు. కామారెడ్డి లో వచ్చే ఏడాది ఎంబిబిఎస్ సీట్ల అడ్మిషన్లు ప్రారంభిస్తామన్నారు.100 బెడ్ల హాస్పిటల్ పనులు చురుకుగా సాగుతున్నాయన్నారు.23 కోట్ల రూపాయల తో కామారెడ్డి లో మరో 50 బెడ్ల హాస్పిటల్ ఇద్దరు మంత్రులు బుదవారం శంకుస్థాపన చేస్తారన్నారు. హాస్పిటల్ శంకుస్థాపనకు ఇద్దరు మంత్రులు స్పీకర్ పోచారం వస్తున్నారన్నారు. క్రిటికల్ కేర్ ఆస్పత్రి రోడ్డు ప్రమాదల లో గాయపడ్డ వారికి సత్వర చికిత్స అందిస్తుందన్నారు. కామారెడ్డి తర్వాత దోమకొండలో పెద్ద ఆసుపత్రినీ తయారు చేస్తామన్నారు. వచ్చే నెలలో రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం పెద్ద ఎత్తున చేపడుతున్నామన్నారు. కామారెడ్డి లో ఏర్పాటు చేస్తున్న డయాలసిస్ కేంద్రం షుగర్ రోగులకు చాలా ఉపయోగపడుతుందన్నారు. వైద్య కళాశాల కోసం 340 ఆసుపత్రి బెడ్ల ను సిద్ధం చేస్తున్నామన్నారు. కెసిఆర్ ప్రభుత్వం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో అల్ట్రా సౌండ్ స్కానింగ్ సెంటర్లు ఏర్పాటుచేసి రోగాల నిర్ధారణకు కృషి చేస్తుందన్నారు. ఈ సెంటర్ల లో గర్భిణీ స్త్రీలలో శరీరంలోని రోగాలను గుర్తించేందుకు ఆదునాతన వైద్య విధానం ద్వారా నిర్ధారణ చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి తీగల తిర్మల్ గౌడ్, ఎంపీపీ శారద నాగరాజు , గ్రంథాలయ చైర్మన్ పున్న రాజేశ్వర్, దోమకొండ సర్పంచ్ అంజలి శ్రీనివాస్,కామారెడ్డి జిల్లా ఆసుపత్రి సూపర్డెంట్ విజయలక్ష్మి,వైస్ ఎంపీపీ పుట్ట బాపురెడ్డి,డాక్టర్ సంగీత్ కుమార్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంట మధుసూదన్, కుంచాల శేఖర్ ఎంపీటీసీ సభ్యులు ఫిరంగి రాజేశ్వర్, కడారి రమేశ్ , వెంకట లక్ష్మి, ఆశాని జ్యోతి, దోర్నాల లక్ష్మి కొ ఆప్షన్ సభ్యులు షమ్మీ, సొసైటీ ఛైర్మన్ నాగరాజు రెడ్డి, తిరుపతి గౌడ్, ఎంపీడీవో చిన్నా రెడ్డి,తహసీదార్ శాంతా , ఏంపీవో తిరుపతి, ఉప సర్పంచ్ గజవాడ శ్రీకాంత్, చాముండేశ్వరి దేవి ఆలయ చైర్మన్ పాలకుర్తి శేఖర్, బొమ్మెర శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ నాగరాజు రెడ్డి బుర్రి రవి వివిధ గ్రామాల సర్పంచులు,పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.