దోమకొండ గ్రంథాలయానికి దాతల సహకారంతో పుస్తకాలు అందజేత.
(ఇందూరు వార్త)
దోమకొండ డిసెంబర్ 29
గ్రంధాలయ ఛైర్మెన్ పున్న రాజేశ్వర్ జెడ్పీటీసీ తీగల తిరుమల గౌడ్ అధ్వర్యంలో దోమకొండ గ్రంధాలయానికి 32000, రూపాయల జనరల్ నాలెడ్జ్ పుస్తకాలను డొనేషన్ గా అందించారు దాతలు పూన్నా లక్ష్మణ్ పోతుల రాజు
కామారెడ్డి జిల్లా
దోమకొండ మండల కేంద్రంలోని గురువారం రోజున గ్రంధాలయ ఆవరణలో విద్యార్థులకు పుస్తక వితరణ చేసినటువంటి జిల్లా గ్రంధాలయ చైర్మన్ పున్న రాజేశ్వర్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరి గ్రంధాలయానికి ముదిరాజ్ సంఘం అభివృద్ధి కమిటీ అధ్యక్షులు పున్న లక్ష్మణ్ అదేవిధంగా పోతుల రాజు దాతలుగా ముందుకు వచ్చి గ్రంధాలయానికి 32000, రూపాయలతో జనరల్ నాలెడ్జ్ పుస్తకాలను డొనేషన్ చేయడం చాలా సంతోష కరమని తెలిపారు.అలాగే గ్రంధాలయ ఛైర్మన్ పన్న రాజేశ్వర్ 27 డిక్షనరీ లను విద్యార్థులకు అందజేశారు.మానవత్వ దృక్పథంతో ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని పున్నా రాజేశ్వర్ తెలిపారు.అనంతరం దాతలకు పూన్న రాజేశ్వర్ వారికి సన్మానం చేసి మేమొంటో అందించారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి తీగల తిరుమల గౌడ్, సర్పంచ్ నల్లపు అంజలి శ్రీనివాస్, ఉప సర్పంచ్ గాజవాడ శ్రీకాంత్, సొసైటీ చైర్మన్ పన్యల నాగరాజు రెడ్డి, కుంచాల శేఖర్, ఎంపిటిసి రమేష్, ఐరెని నర్సయ్య, కానుగంటి నాగరాజు, విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు