దొంతికుంట చెరువు కబ్జాలపై హైదరాబాద్ తరహా చర్యలు చేపట్టాలి
ఇందూరు వార్త డెస్క్ న్యూస్ డిసెంబర్ 10
చెరువు కబ్జాలపై హైదరాబాదు తరహా చర్యలు చేపట్టాలనీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట పట్టణంలోని దొంతికుంట చెరువు స్వాతంత్ర్యానికి పూర్వం నుంచే ప్రజలకు సాగునీరు, త్రాగునీరు అందిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంది. కా కాలక్రమేణా, పంచాయతీ పరిధిలో త్రాగునీటి కుళాయిల ఏర్పాటుతో ఈ చెరువు ఇప్పుడు సాగునీటికి మాత్రమే పరిమితమైంది. గత కొంత కాలంగా విలువైన చెరువు శిఖం భూములపై కబ్జాదారుల కన్ను పడింది, దీంతో దొంతికుంట చెరువు స్వభావం పూర్తిగా మారిపోయింది . 2001లో జన్మభూమి పథకంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనుల నెపంతో చెరువులో కబ్జాలకు బీజం పడింది. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు అలసత్వం చూపడంతో చెరువు శిఖంగా చెప్పుకునే విలువైన భూములు కొంతమంది భూ రాబందుల చేతుల్లోకి మారాయి. ఈ ఆక్రమణల పర్వం రిజిస్ట్రేషన్ల ముసుగులో సాగడం, స్థానిక అధికారుల నిర్లక్ష్యాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపిస్తుంది. చెరువు చుట్టూ ఉన్న భూముల రిజిస్ట్రేషన్ నంబర్ల ఆధారంగా చెరువులోని భూమిని అదే సర్వే నంబర్లతో రిజిస్ట్రేషన్ చేసి అక్రమాలకు తెరలేపారు. అప్పటి రెవెన్యూ అధికారులు, కబ్జాదారులకు తమ వంతు సహాయం అందించారు. ఒక సామాన్య మానవుడు చిన్న ఇంటిని నిర్మించుకోవాలని స్థానిక పంచాయతీ కార్యాలయం గుమ్మం తొక్కితే సవాలక్ష పత్రాలు అడిగే పంచాయతీ అధికారులు, ఆక్రమణకు గురైన దొంతికుంట చెరువులో విలువైన భూముల్లో వాణిజ్య సముదాయాలు, అపార్ట్మెంట్లు, ఇళ్ళు నిర్మించడానికి ప్రత్యేక పాలకవర్గ సమావేశం ఏర్పాటు చేసి అనుమతులు ఇచ్చారు. అప్పటి ప్రభుత్వంలో కీలకమైన నాయకుడు కబ్జాదారులకు కొమ్ము కాయడంతో, ఆయన అనుచరులుగా చెప్పుకునే కొందరు స్థానికులు, చెరువును యదేచ్ఛగా ఆక్రమించి బహుళ అంతస్తుల భవనాలు నిర్మించారు. చెరువు పూడిక స్థలంలో వాణిజ్య సముదాయాలు, అపార్ట్మెంట్లు జరిగినప్పటికీ, ఉన్నతాధికారులు అనుమతులు ఎలా ఇచ్చారో ఇప్పటికీ అంతుచిక్కని రహస్యం. ఏళ్లు గడుస్తున్నా, ప్రభుత్వాలు మారుతున్నా, ఆక్రమణల పర్వం మాత్రం ఆగడం లేదు. మిగిలిన భూముల్లో కూడా ఇటీవల కొందరు అక్రమ లేఅవుట్లు ఏర్పాటుచేసి, ఇళ్ల స్థలాలుగా మార్చి, దానికి ప్రహరీ బెస్మెంట్ వేసి, సుమారుగా గజం 30 నుంచి 50 వేలకు విక్రయిస్తూ, రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారు.
చెరువుకు న్యాయం కావాలని రైతు
చెరువు శిఖం భూముల ఆక్రమణల వల్ల, చెరువులోకి వచ్చే వర్షపు నీటి కాలువలు పూడిపోవడంతో, చుట్టుపక్కల వీధుల్లోకి వరద నీరు ప్రవహిస్తూ, అక్కడ జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తోంది.
నీటిపారుదల శాఖ లెక్కల ప్రకారం దొంతికుంట చెరువు విస్తీర్ణం 29.14 ఎకరాలు కాగా, రెవెన్యూ శాఖ లెక్కల ప్రకారం అది 23.38 ఎకరాలుగా ఉంది. చెరువు ఆక్రమణలపై వస్తున్న ఫిర్యాదులతో రెవెన్యూ శాఖ చెరువు విస్తీర్ణాన్ని తెలుసుకునేందుకు సర్వే నిర్వహించగా, 12 ఎకరాలు మాత్రమే మిగిలి ఉన్నాయని తేలింది.
ఒకప్పుడు 35 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు, అధికారుల అలసత్వం వల్ల 12 ఎకరాలకు పడిపోయిందని స్థానికులు వాపోతున్నారు. ఇక్కడ గజం వచ్చి 30,000 నుంచి 40 వేల వరకు పడుతుంది, ఈ చెరువును ఆక్రమించి కోట్ల దండించారు కోట్ల సంపాదించారు, దొంతికుంట కబ్జాకు కారణం గత ప్రభుత్వం నుంచి ఒక మంత్రి మరీ ఇక్కడ దొర, పట్టణానికి చెందిన వ్యాపారవేత్త కోట్లు గడిచారంటే ఎంత సంపాదించారు చూడండి, రాజకీయ నాయకులు దీనికి ముఖ్య కారణం, దొంతికుంట క్షేత్రస్థాయిలో చెరువు విస్తీర్ణానికి, రికార్డుల లెక్కలకు పొంతన లేకుండా పోవడం విచిత్రం. రెవెన్యూ అధికారులు చెరువు యొక్క మొత్తం విస్తీర్ణాన్ని తెలిపే నక్ష తమ వద్ద అందుబాటులో లేదని, పాత రికార్డులు కనిపించకుండా పోయాయని సమాధానాలు చెబుతున్నారు.