*షబ్బీర్ అలీ దేశద్రోహి*
-ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్
మంత్రి హోదాలో తీవ్రవాదిని పరామర్శించిన దేశద్రోహి షబ్బీర్ అలీ అని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఫైర్ అయ్యారు. మంగళవారం బిక్కనూర్ మండలం బస్వాపూర్ గ్రామంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మీడియా సమావేశం నిర్వహించారు. గత ఆదివారం పెద్దమల్లారెడ్డి గ్రామంలో హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా షబ్బీర్ అలీ చేసిన ఆరోపణలపై గంప గోవర్ధన్ ఫైర్ అయ్యారు. ప్రజల ఆశీర్వాదంతో తాను 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానన్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి పొందిన షబ్బీర్ అలీ.. తాను మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన అభివృద్ధి తప్ప తన హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, రామాయంపేట నుంచి కామారెడ్డి వరకు వెంచర్లు ఉన్నాయని పదేపదే ఆరోపణలు చేస్తున్నారన్నారు. ‘ఇదే బిక్కనూర్ ప్రెస్ వాళ్ళను తీసుకుని వెళ్దాం.. నాకు ఎక్కడైనా వెంచర్లు ఉన్నట్టు నిరూపిస్తే ముక్కు నేలకు రాసి రాజకీయలనుంచి తప్పుకుంటా.. లేకపోతే అదే పెద్దమల్లారెడ్డి సెంటర్లో ముక్కు నేలకు రాసి రాజకీయాల నుంచి వెళ్లిపోతావా షబ్బీర్ అలీ’ అని సవాల్ విసిరారు. నేను వేసిన రోడ్లపై ర్యాలీగా బయలుదేరిన నీకు ఇలా మాట్లాడటానికి సిగ్గనిపించడం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకప్పుడు దోమకొండ తాలూకా ఉంటే బిటిఎస్ నుంచి దోమకొండ వరకు డబుల్ రోడ్డు వెయ్యని వెధవ మంత్రివి నువ్వు.. నేను అభివృద్ధి చేయలేదంటావా అని ఫైర్ అయ్యారు. ‘వెంచర్లలో భాగం ఉందని ఆరోపిస్తావా.. నువ్వు 1000 కోట్లు సంపాదించుకున్నావ్.. నీ తమ్ముడు నయీమ్ ఆర్ అండ్ బి లో వర్క్ ఇన్ స్పెక్టర్ గా ఉండి నువ్వు మంత్రి కాగానే రాజీనామా చేసి 300 కోట్లకు ఆస్తిపరుడయ్యాడు.. అంత ఆస్తి ఎలా సంపాదించారు.. నువ్వు నీ భార్య, నీ తమ్ముడు, తమ్ముని భార్య కలువ వెళ్లి సంపాదించారా.. ప్రజలకు సమాధానం చెప్పాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 5 సార్లు గెలిచిన టర్మ్ లో 1994 నుంచి ఇప్పటివరకు తాను సంపాదించిన ఆస్తిని కామారెడ్డి నియోజకవర్గ ప్రజలకు పంచడానికి సిద్ధంగా ఉన్న.. నువ్వు నీ తమ్ముని ఆస్తి కామారెడ్డి ప్రజలకు పంచుదాం రా షబ్బీర్ అలీ అంటూ మరోసారి సవాల్ విసిరారు. నన్ను అవినీతి పరుడని అంటావా అని ప్రశ్నించారు. నీతి నిజాయితితో పనిచేస్తున్న.. హైదరాబాదులో ఇప్పటికి నాకు ఇల్లు లేదు. కామారెడ్డిలో 218 గజాల ఇల్లు కడితే కబ్జా చేశానన్నావ్.. లిఫ్ట్ ఎక్కి వెళ్తున్న అన్నావ్.. 2 సార్లు గెలిచిన నువ్వు 100 గజాలు జూబ్లీహిల్స్ సొసైటీ నుంచి ఎకరం కబ్జా చేసి దొంగ పనులు చేసుకుంటున్నావ్ అని ఆరోపించారు. ప్రజలు ఎన్నిసార్లు ఓడించిన సిగ్గనిపించడం లేదా.. మనసేందుకు మార్చుకోవడం లేదు.. మాట్లాడే తీరెందుకు మార్చుకోవడం లేదు.. ప్రజలలో వాస్తవం ఏముందో ఎందుకు గ్రహించడం లేదని ప్రశ్నించారు. కామారెడ్డిని సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్ జిల్లాలో కలుపుతున్నారని, కామారెడ్డి జిల్లా కావడం లేదని, గంప గోవర్ధన్ పట్టించుకోవడం లేదని వాట్సప్ లో కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేసి ప్రజలకు అయోమయానికి గురి చేసారని, 2016 లో కామారెడ్డి జిల్లా కేంద్రంగా మార్చామని, జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు సహకరించారని, ప్రజలకు ఇప్పుడేం సమాధానం చెప్తారని నిలదీశారు. నీ సొంత గల్లీల్లో సిసి రోడ్లు వేయించానని, మీ హయాంలో కాంగ్రెస్ నాయకులు వేసిన రోడ్లు 6 నెలలు కూడా ఉండేవి కాదని, ఒకే రోడ్డుపై ఎన్నిసార్లు బిల్లులు పెట్టి తీసుకున్నారో మీ చరిత్ర కామారెడ్డి ప్రజలకు తెలుసన్నారు. 1989లో గెలవక ముందు ఎల్లంపేట నుంచి కామారెడ్డికి దొంగసారా.. దొంగ కలప తెచ్చి అమ్ముకుని బ్రతికిన చరిత్ర నీది షబ్బీర్ అలీ అని ఎద్దేవా చేశారు. నా తండ్రి చిన్న వ్యాపారం చేశారు.. నేను వ్యవసాయం చేసి బ్రతికిన.. నీలాగా బ్లాక్ దందాలు చేయలేదని విమర్శించారు. నీకు పడుకుంటే లేస్తే గంప గోవర్ధనే కనిపిస్తున్నాడా.. నేనంటే అంత భయమెందుకు షబ్బీర్ అలీ.. నా మీద బురద వేయాలని చూస్తే నాకే మంచి జరుగుతుంది తప్ప నీకు కాదన్నారు. ఇప్పటికైనా కామారెడ్డి నియోజకవర్గ ప్రజలకు తప్పని క్షమించమని వేడుకోవాలని షబ్బీర్ ఆలీకి సూచించారు.