దళారులను నమ్మి మోసపోవద్దు ఎమ్మెల్యే జారె
ఇందూరు వార్త నవంబర్ 10 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి
అన్నపురెడ్డిపల్లి మండలం గుంపెన గ్రామంలో జిసిసి ద్వారా వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బంది చూసే బాధ్యత అధికారులదేనని తెలిపారు అలాగే తరుగు తేమశాతం విషయంలో రైతులకు నష్టం జరగకుండా పారదర్శకంగా కొనుగోలు జరపాలన్నారు రైతు సోదరులు ధాన్యాన్ని దళారులకు మధ్యవర్తులకు అమ్మి మోసపోవద్దని ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తు పండించిన ప్రతి గింజను కొంటుందని సన్న రకం ధాన్యానికి 500 రూపాయల బోనస్ అందించడంతోపాటు కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లింపులు వెంటనే చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని రైతులు గమనించి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో విక్రయించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు..