దళారులను నమ్మి మోసపోవద్దు
-వరి ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో అమ్ముకోవాలి
గంభీరావుపేట అక్టోబర్ 28 ఇందూర్ వార్తా ప్రతినిధి
గంభీరావుపేట మండలం కేంద్రంతోపాటు జగదాంబ తండా, దేశాయిపేట, గ్రామాలలో సోమవారం రోజున ఏఎంసి చైర్మన్ కొమిరిశెట్టి విజయ తిరుపతి, వైస్ చైర్మన్ పాతూరి అంజిరెడ్డి, ఐకెపి సెంటర్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రమును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం నిర్మించిన కొనుగోలు సెంటర్లకు అమ్ముకొని లబ్ధి పొందాలని రైతులకు సూచించారు, రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యానికి సరైన మద్దతు ధర కల్పిస్తోంది అని సన్నవడ్లకు 500 రూపాయలు బోనస్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దళారులకు అమ్మవద్దని రైతులకు విన్నవించారు, ఒక బస్తా తూకం 40 కిలోల 600 గ్రాములు తూకం వేయడం జరుగుతుంది అని రైతులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో కార్యక్రమంలోసెస్ డైరెక్టర్ గౌరీనేని నారాయణరావు, ఏఎంసీ డైరెక్టర్లు
బాల్ రెడ్డి, ప్రభాకర్, విఠల్, సత్యం, రాజనర్సు, అజాం మరియు పాక్స్ సొసైటీ డైరెక్టర్లు రాజ్వీర్, అంజిరెడ్డి, ఎల్లవ్వ, భీమ్లా నాయక్, సీఈవో రాజిరెడ్డి సెంటర్ ఇంన్చార్జ్ ప్రవీణ్, , పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ (గౌరి) శంకర్, పర్శరాములు, లచ్చయ్య, బాలయ్య, మహేష్, నాంపల్లి ,రాజు గౌడ్, దన్ రాజ్, బాల్య నాయక్, బలరాం రెడ్డి లాల్య నాయక్. భాస్కర్ మోహన్ , లక్ష్మణ్ పంచాయతీ సెక్రటరీ రాజేశ్వరి, గోపాల్ మహేందర్ అరుణ్ దేవయ్య ప్రభాకర్ కిషన్ శ్రీనివాస్, తో పటు రైతులు మరియు హమాలీలు కార్మికులు పాల్గొన్నారు.