దక్షిణాసియా జర్నలిస్ట్ వర్క్ షాప్ నకు వాకిటి వెంకటేశం ముదిరాజ్ కు ఆహ్వాన
ఇందూర్ వార్త : వెబ్ డెస్క్
గత ఏడాది జులై నెలలో వెదర్ రిసెర్చర్ గా అమెరికా ప్రభుత్వం ఆహ్వానం మేరకు యూఎస్ కి వెళ్లిన సీనియర్ జర్నలి స్ట్ వాకిటి వెంకటేశం ముదిరాజ్ కు మరో అరుదైన అవకాశం లభించింది. ఈ నెల 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు కొలంబో (శ్రీలంక)లో సౌత్ ఆసియా జర్నలిస్ట్ ల వర్క్ షాప్ నకు హాజరుకావాల్సిందిగా తెలంగాణ రాష్ర్టానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ వాకిటి వెంకటేశం కు ఆహ్వానం అందింది. ఇండో పసిఫిక్ మీడియా అడ్వాన్స్ మెంట్ ప్రోగ్రామ్ ని ఇంటర్ న్యూస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ వర్క్ షాప్ కు దక్షిణాసియాలోని వివిధ దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారు. ఈ వర్క్ షాప్ లో జర్నలిస్ట్ ల పనిలో నైపుణ్యం పెంపొందించడంతోపాటు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం, పాత్రికేయుల సామర్థ్యం మెరుగుపరచడానికి శిక్షణ ఇవ్వనున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో పాత్రికేయులు, మీడియా పాత్ర మరువలేనిది. అలాంటి మీడియాను నడుపుతున్న పాత్రికేయులకు ఈ నైపుణ్య శిక్షణ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని యూఎస్ ఆథారిత అంతర్జాతీయ ఎన్జీవో ఇంటర్ న్యూస్ తెలిపింది. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో అపార అనుభవం గల వాకిటి వెంకటేశంకు దక్షిణాసియా జర్నలిస్ట్ వర్క్ షాప్ నకు ఇండియా తరుపున హాజరయ్యే అవకాశం రావడం తెలంగాణ జర్నలిస్ట్ లకు గర్వకారణమని కొందరు సీనియర్ జర్నలిస్టులు చెబుతున్నారు. ఇప్పటికే ఆయన అమెరికా ప్రభుత్వం ఆహ్వానం మేరకు క్లైమెట్ క్రైసెస్ ఫర్ వెదర్ ఇన్ఫ్లూయెన్సర్స్ ప్రాజెక్టులో పార్టిసిస్పెంట్‌గా వెళ్లారు. జులై 06, 2024 నుంచి జులై 27, 2024 వరకు ఈ ప్రాజెక్టులో భాగంగా అమెరికాలోని వాషింగ్టన్ డీసీ, ఓక్లహామ,కొలరాడో, ఫ్లోరిడా ప్రాంతాల్లో పర్యటించి, వాతావరణంపై అధ్యయనం చేశారు. ఈ అధ్యయన నివేదికను అమెరికా ప్రభుత్వానికి అప్పగించి, నెల రోజుల తర్వాత తిరిగి ఇండియాకు చేరుకున్నారు. అంతకుముందు గూగుల్ న్యూస్ ఇన్సియేటివ్ ప్రాజెక్టులో భాగస్వామి అయిన వాకిటి వెంకటేశం ముదిరాజ్, 25 ఏళ్లుగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా రంగాల్లో వివిధ స్థాయిల్లో పని చేసి, అపార అనుభవం సంపాదించారు. ప్రజాశక్తి తెలుగు దినపత్రికలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు తీసుకుని పత్రిక రంగంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత తెలుగులో నెంబర్ వన్ న్యూస్ ఛానల్ టీవీ9లో సబ్ ఎడిటర్ గా తన ప్రస్థానం ప్రారంభించి, చీప్ సబ్ ఎడిటర్, డిప్యూటీ న్యూస్ ఎడిటర్ గా, న్యూస్ ఎడిటర్ గా, డిప్యూటీ అవుట్ పుట్ ఎడిటర్ గా డెస్క్ ఇన్చార్జ్ అంచెలంచెలుగా ఎదుగుతూ వివిధ స్థాయిలో పని చేశారు. అనంతరం 99టీవీ, సీవీఆర్, భారత్ టుడే, స్వతంత్ర, ఐన్యూస్, ప్రైమ్ 9 వంటి న్యూస్ ఛానళ్లకు అవుట్ ఎడిటర్‌గా సేవలు అందించారు.
ఈ క్రమంలోనే ఫేక్‌న్యూస్ అరికట్టడానికి తన టీమ్ మెంబర్స్ కి ఎప్పటికప్పడు అవగాహన కల్పిస్తూ, తప్పుడు కథనాలు కట్టడికి తన వంతు కృషి చేశారు. అంతేకాకుండా నీటిపారుదల, వ్యవసాయ రంగం, వలస కార్మికుల సమస్యలను ఎత్తిచూపుతూ వివిధ కథనాలు ప్రచురితం చేసి, అటు ప్రభుత్వం, ఇటు అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపగలిగారు.
2006 సునామీ సమయంలో డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ లతో కలిసి, వరద బాధితులకు అత్యవసరాలు అందించడంతోపాటు వరదలు, తుఫాన్ వార్తలను కవర్ చేయడంలో తన వంతు పాత్ర పోషించారు. వరదల నష్టాలు, తుఫాన్ బాధితుల ధీనస్థితి, విపత్తు గురించి విస్రృత కథనాలను ప్రత్యేకంగా న్యూస్ బులెటిన్లు ఏర్పాటు చేసి, ప్రసారం అయ్యేలా చేశారు. తెలుగు మీడియాపై తనదైన ముద్ర వేసిన సీనియర్ జర్నలిస్ట్ వాకిటి వెంకటేశం ముదిరాజ్ కి దక్షిణాసియా జర్నలిస్ట్ వర్క్ షాప్ నకు హాజరయ్యే అరుదైన అవకాశం రావడం నిజంగా గర్వ కారణం.