దమారిన జీవన శైలి, జన్యుపరమైన కారణాలు, సరైన పోషకాలు లేని ఆహారం తీసుకోవడం వంటి కారణాలతో థైరాయిడ్ సమస్య బారినపడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఇందులో రెండు రకాల సమస్యలు ఉన్నాయి. థైరాయిడ్ హార్మోన్లు సరిగా ఉత్పత్తికాకపోవడం ‘హైపో థైరాయిడిజం’, థైరాయిడ్ అతిగా స్పందించడం ‘హైపర్ థైరాయిడిజం’ అని చెబుతారు. ఈ రెండింటితోనూ కంటి ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని… ముఖ్యంగా హైపర్ థైరాయిడిజంతో ఎక్కువ నష్టం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మన శరీరంలో థైరాయిడ్ గ్రంథి ఉండే ప్రదేశం
దృశ్యాలన్నీ ఉబ్బెత్తుగా కనిపించడం…
థైరాయిడ్ సమస్య ఏర్పడినప్పుడు కళ్ల వెనుక భాగంలో వాపు వచ్చి… కనుగుడ్లపై ఒత్తిడి పెరుగుతుంది. దీనితో అన్నీ కూడా ఉబ్బెత్తుగా (కుంభాకారంలో) కనిపిస్తుంటాయి. ఇది మొదట చాలా మెల్లగా మొదలై ఇబ్బందికరంగా మారుతుంది. ఈ సమస్య మరింతగా పెరిగితే కళ్ల అలైన్ మెంట్ దెబ్బతిని… అన్నీ రెండుగా కనిపిస్తుంటాయి. దేనిపైనా సరిగా దృష్టి పెట్టలేని పరిస్థితి ఏర్పడుతుంది. కళ్లు పొడిబారడం, మంటగా అనిపించడం…థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నవారిలో కన్నీళ్ల ఉత్పత్తి తగ్గిపోతుంది. ఇది కళ్లు పొడిబారడం, దురదగా అనిపించడానికి దారితీస్తుంది. కళ్లు ఎర్రగా మారుతాయి. దీన్ని నిర్లక్ష్యం చేస్తే కంటి చూపుపై ప్రభావం పడుతుంది. కాంతిని భరించలేకపోవడం…థైరాయిడ్ హార్మోన్లలో హెచ్చుతగ్గులు, సమస్యల కారణంగా… కళ్లు కాంతిని భరించే సామర్థ్యం తగ్గిపోతుంది. మిగతా వారంతా సాధారణ వెలుగేనని భావించేంత కాంతిని కూడా వీరు తట్టుకోలేకపోతారు. దేనిపై అయినా దృష్టి పెట్టడానికి ఇబ్బందిపడతారు. కళ్లు ఉబ్బిపోవడం, కనుగుడ్ల కదలికలో ఇబ్బందులు
థైరాయిడ్ సమస్య మరీ ఎక్కువగా ఉన్నవారిలో కళ్లు ఉబ్బిపోతాయి. కనుగుడ్లను అటూ ఇటూ కదిలిస్తూ చూడానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది. కంటి చూపు కోల్పేయే ప్రమాదం కూడా…
థైరాయిడ్ సమస్య మరీ ఎక్కువగా ఉన్న సమయంలో కళ్ల నుంచి మెదడుకు వెళ్లే నాడులు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అదే జరిగితే చూపు కోల్పోయే ప్రమాదం కూడా ఎక్కువేనని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది చాలా అరుదు అని పేర్కొంటున్నారు.
టఅమెరికా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్) అధ్యయనం ప్రకారం… మన రోగ నిరోధక కణాలే, మన శరీరంలోని థైరాయిడ్ గ్రంథిపై దాడి చేసే ‘గ్రేవ్స్ డిసీజ్’ వంటి వాటిలో కళ్లపై ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుం