తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ కూలీలకు 12 వేల రూపాయల జీవనభృతిని వెంటనే ఇవ్వాలి. (ఏ ఐ పీ కే ఎం ఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్లపూడి రాము
ఇందూరు వార్త నవంబర్ 25 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి
వ్యవసాయ కూలీలకు జీవనభృతిగా ఏడాదికి 12,000 ఇస్తానని హామీ ఇచ్చి 11 నెలలు అవుతున్న ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేయడం లేదని అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐపీకే ఎంఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్లపూడి రాము సిపిఐ ఎం ల్మా స్ లైన్ డివిజన్ కార్యదర్శి గోకినపల్లి ప్రభాకర్ అన్నారు.
అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం(ఏఐపీకేఎంఎస్) పిలుపు మేరకు మార్కెట్ యార్డ్ లో జరిగిన సధస్సు లో వారు మాట్లాడుతూ. దేశంలో 50% పైగా వ్యవసాయ కూలీలు ఉన్నారని తెలంగాణ రాష్ట్రంలో 55% పైగా వ్యవసాయ కార్మికులు ఉన్నారని వీరికి ఏడాది పొడవున వ్యవసాయంలో పని దొరకటం లేదని, పని దొరికిన దినాలలో తక్కువ ఆదాయం వస్తుందని దీనివలన విద్య, వైద్యం, తలదాచుకోవడానికి గూడు లేక జంతువుల మాదిరిగా బతుకుతున్నారని అన్నారు పుట్టిన పిల్లలకు పౌష్టిక ఆహారం లేక తగినంత బరువు లేక శరీరంలో కావాల్సిన రక్తం లేక వారి పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు లంకె బిందెలు ఉంచాడేమోనని అనుకున్న కానీ ఖజానంత ఖాళీ చేసి పోయాడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనడం సరైనది కాదని. ధనిక రాష్ట్రం నెంబర్ వన్ రాష్ట్రం అన్న కేసీఆర్ గారు తన పాలనలో వ్యవసాయ కూలీలకు చేసింది శూన్యమేనని దేశవ్యాప్తంగా 14 కోట్ల వ్యవసాయ కూలీలకు కేంద్రంలోని బిజెపి నరేంద్ర మోడీ పాలనలో వ్యవసాయ కూలీలకు చేసింది ఏమీ లేదని. ఒకరిపై ఒకరు చమత్కారాలు సెల్ ఒక్తులతో కూలీలను మోసం చేస్తున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెలకి 4000 రూపాయలు ఇస్తానని హామీ ప్రకారం అంటే సంవత్సరానికి 45 వేల రూపాయలు ఇవ్వాలని అన్నారు. తక్షణమే వ్యవసాయ కార్మికులకు 12 వేల రూపాయల జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సదస్సు అనంతరం మార్కెట్ యార్డ్ నుండి భారీ ప్రదర్శనగా తాసిల్దార్ కార్యాలయం చేరుకొని ధర్నా నిర్వహించి తహసిల్దారు కు డిమాండ్స్ తో కూడిన మెమోరాన్ని ఇవ్వడం జరిగింది
ఈ సమస్యలపై నవంబర్ 20 నుండి గ్రామాలలో విస్తృతంగా ప్రచార నిర్వహించడం జరిగింది డిసెంబర్ 2 తేదీన కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రదర్శన ధర్మాను విజయవతం చేయాలని వ్యవసాయ కూలీలకు పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకురాలు తోడం దుర్గమ్మ,AIPKMS డివిజన్ అధ్యక్షులు కుర్సం ముత్యాలరావు, పండురి వీరబాబు, కాక వెంకటేష్, తామ రాముడు, కుంజ కాంతారావు, కాకా రమేష్, వగెల ప్రసాద్ జుంజునూరు ముక్తేశ్వరి, రొక్కోల అనిల్ కుమార్, వాడే గిరి, ఓకే మహేష్, బొగ్గు రాము, నాగరాజు, నాగమణి, వాడే జయ తదితరులు పాల్గొన్నారు
ఇట్లు
విప్లవ అభినందనలతో.
అమర్లపూడి రాము
జిల్లా ప్రధాన కార్యదర్శి.
అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (AIPKMS)