తెలంగాణ గురుకుల పాఠశాల, బ్యాక్ లాగ్ సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష
ఇందూర్ వార్త ప్రతినిధి
తంగళ్ళపల్లి మండలం నేరెళ్ళలోని తెలంగాణ గురుకుల పాఠశాలలో 6,7,8 తరగతులలో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ సీట్ల భర్తీకి జూలై 30న పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ జి. రాధ గారు తెలిపారు. జూలై 29లోగా దరఖాస్తుతో పాటు, కులధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డ్ జిరాక్స్ 2 ఫొటోస్ సమర్పించాలన్నారు. విభాగాలవారీగా ఖాళీలు, మెరిట్ జాబితా ఆధారంగా భర్తీ చేస్తామన్నారు. నేరెళ్ళలోని తెలంగాణ గురుకుల పాఠశాల ఆవరణలో ప్రవేశపరీక్ష నిర్వహిస్తామన్నారు.