ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు
కౌడిపల్లి మండలం తునికి గ్రామంలోని స్వస్తిశ్రీ శోభకృత్ నామ సం॥ర కార్తీక మాసం శు॥ పౌర్ణమి తేది : 27-11-2023 సోమవారం రోజున సా॥ 6 గం॥లకు శ్రీ నల్ల పోచమ్మ దేవస్థాన ఆలయ ప్రాంగణములో దీపోత్సవము నిర్వహించబడును.
అమ్మవారి ఆలయ ప్రాంగణములో మరియు పరిసర ప్రాంతములలో దీపజ్యోతులు వెలిగించడము వలన వారి సర్వ పాపములు హరించిపోయి దైవానుగ్రహం కలుగుతుందని శాస్త్ర వచనం చెప్పబడినది.
కావున పై కార్యక్రమములలో భక్తులు దీపజ్యోతులు వెలుగించుటకు అవసరమగు దీపం మట్టి ప్రమిదలు మరియు దీపం వత్తులు నూనె తీసుకొని వచ్చి నిర్ణయించిన సమయములో వెలిగించిన అనంతరం అన్న ప్రసాదము స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు
పి. మోహన్ రెడ్డి కార్యనిర్వహణాధికారి మరియు సిబ్బంది
పురాణ కథ
ఇది ప్రాచుర్యంలోకి రావడానికి ఒక కథ ఉంది. పాండ్యుడు, కుముద్వతి దంపతులు సంతానార్థం శివుని ఆరాధించి ప్రత్యక్షం చేసుకున్నారు. వారుచేసిన ఆరాధనలోని చిన్నలోపంవల్ల సరైన వరం ఇవ్వదలచుకోలేదట శివుడు. అందుకే ‘అల్పాయుష్కుడు, అతిమేధావి అయిన కొడుకు కావాలా… పూర్ణాయుష్కురాలు, విధవ అయిన కుమార్తె కావాలా అని అడిగితే- కుమారుణ్నే కోరుకున్నారా దంపతులు. అతడి వయసు పెరుగుతున్న కొలదీ వారిలో గుబులూ జోరెత్తుతోంది. ఆ సమయంలో శివభక్తి పరాయణురాలైన అలకాపురి రాజకుమార్తెపై వారి దృష్టిపడింది. అమే పిలిస్తే శివుడు పలికేటంత భక్తి, శక్తి కలదని విన్నారా దంపతులు. ఆ పిల్లను తమ కోడలిగా చేసుకుంటే తమబిడ్డను పూర్ణాయుష్కుడిగా మార్చే బాధ్యత ఆమె చూసుకుంటుందని ఆలోచించి అలాగే చేశారు. వివాహమైన కొన్నాళ్లకే భర్తకోసం యమభటులు వచ్చేసరికి విషయం తెలుసుకుందా సాధ్వి. తక్షణమే తనభక్తి ప్రభావంతో శివుని ప్రార్థించి ప్రత్యక్షం చేసుకుని భర్తను పూర్ణాయుష్కుడిగా మార్చుకునే వరం పొందిందని పురాణ కథనం. ఇక్కడ ఇంకొక కథ కూడా ప్రాచుర్యం పొందింది. ఈ పౌర్ణమికు త్రిపుర పూర్ణిమ అని మరొకపేరు. తారకాసురుడి ముగ్గురు కుమారులూ బ్రహ్మను మెప్పించి, ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించగలిగే మూడు పురాలను వరంగా పొందారు. ఎవరివల్లా మరణం లేకుండా వరంకోరారు. అది సాధ్యం కాదన్నాడు బ్రహ్మ. అలాగైతే రథంకాని రథంమీద, విల్లుకాని విల్లుతో, నారికాని నారి సారించి, బాణంకాని బాణం సంధించి, మూడు నగరాలూ ఒకే సరళరేఖలోకి వచ్చాక ఒకే బాణంతో ముగ్గురినీ ఏకకాలంలో కొడితేనే మరణం సంభవించేలా వరం కోరారు. ఇవ్వక తప్పలేదు బ్రహ్మకు. ఆ వర బలంతో పట్టణాలతో సహా సంచారంచేస్తూ లోకాలన్నింటా కల్లోలం సృష్టిస్తున్నారు. వివిధ లోకవాసులు బ్రహ్మకు మొర పెట్టుకున్నారు. వరం ఇచ్చింది తానే కాబట్టి ఏమీ చేయలేనన్నాడు. విష్ణువు దగ్గర కెళ్ళమని ఉపాయం చెప్పాడు. విష్ణువు కూడా తనకా శక్తిలేదని, వారిని వెంటపెట్టుకుని శివుడి దగ్గరకు వెళ్లాడు. దేవతలందరూ సహకరిస్తే తానీపని చేయగలనన్నాడు శివుడు. ఆ మాటతో భూమి రథం కాని రథంగా మారింది. మేరు పర్వతం విల్లుకాని విల్లుగా, ఆదిశేషువు అల్లెతాడు కాని అల్లెతాడుగా, శ్రీమహావిష్ణువు బాణం కాని బాణంగా మారారు. వీరందరి సమాహార శక్తితో శివుడు త్రిపురాసురులను (మూడు పట్టణాల యజమానులైన రాక్షసులను) సంహరించాడని, అందువల్ల ఈ పేరు వచ్చిందనీ పురాణ కథనం.
ప్రత్యేకంగా చేయవలసినవి
దైవ దర్శనం, దీపారాధన, దీపదానం, సాలగ్రామ దానం, దీపోత్సవ నిర్వహణ ఈ రోజు విశేష శుభ ఫలితాలను అనుగ్రహిస్తాయి అని కార్తీక పురాణంలో పేర్కొనబడింది. ఎవరి శక్తి సామర్ధ్యాలను బట్టి హరి హారులను సేవించి వారి కారుణ కటాక్షాలు పొందుతారు. వీరిని ఎంత నిష్ఠతో తరిస్తే అంత శుభఫలితాలు ఉంటాయి.
సంఘటనలు
- భీమవరం లోని మావూళ్ళమ్మ దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి నెల పౌర్ణమిరోజు చండీహోమం నిర్వహించబడుతుంది.పండుగలు , జాతీయ దినాలుమార్చు
- జ్వాలా తోరణము
- కేదారేశ్వర వ్రత కల్పము
- తులసీ పూజ
- కార్తీకదీపం
- కోరల పున్నమి
- గురునానక్ జయంతి
- ధాత్రీ పూజ