డిసిహెచ్ఎస్ రవి బాబు పై విచారణ
బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్
*కొత్తగూడెం* డిసిహెచ్ఎస్ రవిబాబుపై హైదరాబాద్ లోని వైద్య విధాన పరిషత్ కమీషనర్ ను తను చేసిన ఫిర్యాదుపై శనివారం విచారణ జరిగినట్టు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ యెర్రా కామేష్ తెలిపారు.నోటిఫికేషన్ లేకుండా చేసిన అక్రమ నియామకాలు,నియామకాల్లో రూల్ ఆఫ్ రోస్టర్ విధానం పాటించకపోవడం,బదిలీలు, డిప్యూటేషన్లు,తన సమీప బంధువును అక్రమ పద్ధతిలో నియమించడం,టెండర్ ప్రక్రియ లేకుండా నిర్వహించిన పనులు మరియు సామాగ్రి కొనుగోలు తదితర అంశాలపై తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ కు ఆగస్టు 8వ తేదీన లిఖతపూర్వకంగా పిర్యాదు చేయగా కమీషనర్ ఆదేశాలపై విచారణ అధికారిగా సూపరింటెండెంట్ డి.హెచ్.క్యూ.హెచ్.ఎస్ ఖమ్మం.కె.రాజశేఖర్ గౌడ్ మరియు వారికి ఎం.సత్యనారాయణ,ఎల్.సునీల్ కుమార్,సి.ఏచ్.రత్నాకర్ రావు సహాయ సిబ్బంది గల అధికారులతో భద్రాద్రి జిల్లా డిస్ట్రిక్ హెడ్ క్వార్టర్ హాస్పటల్ కార్యాలయం నందు విచారణకు హాజరయ్యి విచారణ అధికారికి తన వద్ద గల సమాచారం అందజేయడం జరిగిందన్నారు.అదేవిధముగా గూగులోత్ రావిబాబుపై గతంలో జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేసిన బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు *గంధం మల్లికార్జునరావు,మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు పూల రవీందర్,మాలోత్ అశోక్ కుమార్* పాల్గొనట్లు తెలిపారు