డివైడర్ సెంటర్ లైటింగ్ కు 7.5 కోట్ల మంజూరు
ఇందూర్ వార్త
బీర్కూర్ 24 డిసెంబర్
బీర్కూర్ గ్రామ ప్రజలు ఎన్నో రోజులు ఎదురు చూస్తున్న డివైడర్ సెంటర్ లైటింగ్ కు 7.5 కోట్ల రూపాయలు మంజూరు అయినట్లు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సెంటర్ లైటింగ్ బీర్కూర్ కామన్ నుంచి సిద్ధి వినాయక ఇండస్ట్రీస్ వరకు మంజూరైనట్లు తెలిపారు. ఈ సెంటర్ లైటింగ్ అందుబాటులోకి వస్తే లైటింగ్ తో కలకలాడుతుంది. ఈ సెంటర్ లైటింగ్ మంజూరు చేసినందుకు బీర్పూర్ గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు.