డయల్ 100 దుర్వినియోగం చేసిన వ్యక్తి బైండోవర్
గంభీరావుపేట సెప్టెంబర్1 : ఇందూరు వార్త ప్రతినిధి
మద్యం మత్తులో డయల్ 100 కు అనవసరంగా ఫోన్ చేసిన బట్టు కిషన్ (బద్రి) అనే వ్యక్తిని గంభీరావుపేట తహసిల్దార్ లగి శెట్టి భూపతి ముందు శనివారం రోజున పోలీస్ సిబ్బంది బైండోవర్ చేయడం జరిగింది.ఎమర్జెన్సీ సర్వీస్ అయినా డయల్ 100 ను ఎవరైనా దుర్వినియోగం చేసినట్లయితే అట్టి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై బి రామ్మోహన్ తెలిపారు.