జేఎన్టీయుహెచ్ యూనివర్సిటీ లో నూతన జేఏసీ కమిటీ ఏర్పాటు:
ఇందూరు వార్త డెస్క్ న్యూస్ డిసెంబర్ 9
హైదరాబాద్ లోని జేఎన్టీయూ యూనివర్సిటీ లో సోమవారం నాడు జరిగిన జేఏసీ కార్యక్రమంలో నూతన జేఎన్టీయుహెచ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి మంద రంజిత్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ మేరకు నూతన జేఏసీ రాష్ట్ర అధ్యక్షులుగా కోత్తూరు పవన్ కుమార్ ఎన్నికయ్యారు.
అలాగే జేఎన్టీయుహెచ్ జేఏసీ రాష్ట్ర చైర్మన్గా మంద రంజిత్ కుమార్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.
త్వరలో యూనివర్శిటీ మరియు అనుబంధ కాలేజీల్లో జేఏసీ కమిటీలను ఏర్పాటు చేయడంలో రాష్ట్ర జేఏసీ కమిటీ దృష్టి సారించారు. అదేవిధంగా విద్యార్థుల సమస్యలను ప్రాతినిధ్యం చేసే “స్టూడెంట్స్ మేనిఫెస్టో” త్వరలో విడుదల చేయనున్నట్లు కమిటీ సోమవారం నాడు ప్రకటించింది.
ఈ చర్యలు విద్యార్థుల హక్కుల సాధనకు, సమస్యల పరిష్కారానికి దోహదం చేస్తాయని జేఎన్టీయుహెచ్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర సభ్యులు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు.