జి.సి.సి హమాలీ కార్మికులకు సంఘీభావం తెలిపిన భద్రాద్రి రేషన్ డీలర్స్.
ఇందూర్ వార్త ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి జనవరి 6
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మండలంలో ఉన్నటువంటి జి.సి సి లో పని చేస్తున్నటువంటి హమాలీ కార్మికులు గత కొద్దిరోజుల నుంచి వారికి ప్రభుత్వం నుంచి రావాల్సి నటువంటి బకాయిలు. ప్రభుత్వం ఏర్పడిన తరవాత ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి అంటూ జి సి సి కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు వారికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్స్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఊకె శేఖర్ సూచనల మేరకు డివిజన్ అధ్యక్షుడు సందీప్ ఆధ్వర్యంలో భద్రాచలం జిసిసి కార్మికులు చేస్తున్నటువంటి సమ్మెలో ఉన్నటువంటి కార్మికులకు పూలదండలు వేసి సంఘీభావం తెలిపి వారు కోరుతున్నటువంటి డిమాండ్లను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని పరిష్కరించని ఎడాల ప్రజలకు అందవలసిన రేషన్ బియ్యం సరఫరా . గవర్నమెంట్ పాఠశాలలకు ముడి సరుకులు సరఫరా నిలిచిపోవడం వలన అటు పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు, పేద ప్రజలకు అందవలసిన రేషన్ బియ్యం సకాలంలో అందక వాళ్ళందరూ ఇబ్బందులకు గురవుతారు .కావున దీనిని ప్రభుత్వం గుర్తించి వారికి ఇచ్చినటువంటి హామీలు. వారికి రావాల్సి నటువంటి పాత బకాయిలు వెంటనే చెల్లించాల్సిందిగా ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్స్ సంక్షేమ సంఘం అధ్యక్షులు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం డివిజన్ ప్రెసిడెంట్ సందీప్ మండల అధ్యక్షురాలు ఇరప చిన్నక్క, జిల్లా ఉప కార్యదర్శి సాయి కౌశిక్, అజ్మీర రవి, లక్ష్మణరావు, సాయి, కృష్ణ, తదితర రేషన్ డీలర్లు సంతాపం తెలిపారు.