జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాలను ఆహ్వానించిన అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె
ఇందూర్ వార్త నవంబర్ 16 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి
ఈ నెల 18 తేదీ నుండి 20 తేదీ వరకు అన్నపురెడ్డిపల్లి తెలంగాణా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ జూనియర్ కళాశాలలో నిర్వహించే రాజ్యస్థరీయ బాల్ వైజ్ఞానిక్ ప్రదర్శన 2024-25 (జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన కు) *అశ్వారావుపేట పేట శాసన సభ్యులు జారె ఆదినారాయణ డిసిఎంఎస్ర్మన్, రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు ను హాజరు కావలసిందిగా ఆహ్వానించారు. శనివారం పాత పాల్వంచ లోని కొత్వాల స్వగృహనికి ఎం.ఎల్.ఏ జారె వచ్చి ఆహ్వానపత్రిక అందజేశారు. ఈ సందర్బంగా కొత్వాలఎం.ఎల్.ఏ ను శాలువా, బొకేలతో ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో పాల్వంచ మాజీ జడ్పీటీసీ సభ్యులు యర్రంశెట్టి ముత్తయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న తదితరులు పాల్గొన్నారు.