*జిల్లా మహిళా కాంగ్రెస్ కార్యదర్శి*
*పొదిలి జ్యోతి అధ్యక్షతన ఇందిరా గాంధీ వర్ధంతి*
మహిళా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇందిరా గాంధీ గ వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది.
ప్రపంచంలోనే ఇందిరాగాంధీ ఉక్కు మహిళగా పేరు పొందారు
దేశం సురక్షితంగా ఉండాలి అని ఉగ్రవాదుల తూటాలకు బలి అయ్యారు, ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న హయాంలో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.
ఆమెను అనుసరిస్తూ ల్యాండ్ రిఫామ్స్ తీసుకొచ్చారు పీవీ నరసింహారావు
బడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్న వ్యక్తి ఇందిరా గాంధీ
దేశ ఐక్యత కోసం తమ ప్రాణాలు అర్పించిన వారు ఇందిరా గాంధీ
ఇందిరా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది
ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కార్యదర్శి పోదిలి జ్యోతి , మరియు దమ్మపేట మండల మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ కుంటా యశోద, మహిళా కాంగ్రెస్ మండల సెక్రెటరీ మచ్చల పార్వతి, రామలక్ష్మి కృష్ణవేణి మరియు మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.