జాతీయ మహాసభలలో పాల్గొన్న భారతీయ విద్యార్థి మోర్చా నాయకులు
ఉత్తరప్రదేశ్ లక్నోలో జరుగుతున్న భారతీయ విద్యార్థి మోర్చా దాని అనుబంధ సంఘాల జాతీయ మహాసభలలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శలు బట్టు శ్రీధర్, ఙివియం విఠల్ కామారెడ్డి జిల్లా అధ్యక్ష కార్యదర్శలు ప్రసన్న కుమార్ యశ్వంత్ , యువ మోర్చా జిల్లా అధ్యక్ష కార్యదర్శలు పెరుమాండ్ల బుల్లెట్ , ప్రభాకర్ యూనివర్సిటీ నాయకులు ఆర్బాస్ ఖాన్, మనోజ్,ప్రవీణ్, రాజు,మల్లేశం,సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ జాతీయ మహాసభలలో 1 వ రోజు దేశానికి స్వతంత్ర వచ్చి 75 సంవత్సరల గడుస్తున్నా దేశంలో విద్యా వ్యవస్థ మరియు వెనకబడిన ఆదివాసీ ,నిరుద్యోగం గూర్చి చర్చా జరిగింది .2 వ రోజు నూతన విద్యా విధానం దాని పరిణామాలు విద్యా వ్యవస్థ లో ప్రైవేటైజేషన్ పై చర్చా జరుగుతుంది అని అన్నారు. నూతన విద్యా విధానం వల్ల ఎస్సీ ,ఎస్టీ ,బీసీ, మైనార్టీ ములనివాసి విద్యార్థుకు విద్యాను దూరం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చదువుకు దూరం చేస్తున్నాయి అన్నారు. బిజెపి అధికారంలోకి వస్తే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి 8 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కనీసం కోటి ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు అంటే విద్యార్థులపై నిరుద్యోగులపై బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు బట్టి మనం అర్థం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ సంస్థలైనటువంటి ఎల్ఐసి బిఎస్ఎన్ఎల్ రైల్వే ను కార్పొరేట్ అతని అంబానీలకు కట్టబెట్టి కోట్లది రూపాయలు అప్ప చెప్పడం జరిగిందన్నారు.