ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు
భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 16 వ తేదిన జాతీయ పత్రికాదినోత్సవం జరుపుకుంటారు 1956లో భారత తొలి ప్రెస్ కమిషన్ సిఫార్స్ మేరకు 1966 నవంబర్ 16 వ తేదిన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం నవంబర్ 16వ తేదిన జాతీయ పత్రికా(నేషనల్ ప్రెస్ డే) దినోత్సవాన్ని జరుపుకుంటారు.
ఒక దేశంలో ప్రజాస్వామ్య ము సక్రమంగా పనిచేస్తున్నదీ లేనిదీ తెలుసుకోవాలంటే ఆ దేశములో పత్రికా రంగాన్ని పరిశీలిస్తే చాలు. పత్రికా రంగము మీద ఎటువంటి ఆంక్షలు లేకుండా పత్రికా స్వాతంత్ర్యము అమలవుతుంటే ఆ దేశంలో ప్రజాస్వామ్య పాలనకు, చట్టబద్దపాలనకు ఢోకాలేనట్టే.
ప్రెస్ కౌన్సిల్ పత్రికారంగాన్ని పరిశీలించటంతో పాటు వార్తల తీరుతెన్నులపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి వృత్తిపరమైన అక్రమాలకు పాల్పడిన పత్రికలు, సంస్థల చర్యలను విమర్శించటం, అభిశంసించటం, చర్యలకు సిఫార్సు చేస్తుంది. పత్రికా స్వేచ్ఛ కోసం పనిచేయాలన్నది లక్ష్యం. ప్రపంచంలో అనేక దేశాలలో ప్రెస్ కౌన్సిళ్లు ఉన్నాయి. అయితే మనదేశ కౌన్సిల్‌కు ఉన్న ప్రత్యేకత ఏమంటే ప్రభుత్వశాఖలపై కూడా తన అధికారాన్ని వినియోగించే అవకాశం కలిగి ఉంది. పత్రికలు, మీడియా స్వయంగా ఉన్నత ప్రమాణాలను నిర్ణయించుకొని అమలు జరిపే విధంగా ప్రెస్‌కౌన్సిల్ ప్రోత్సహిస్తుంది.
గత పన్నెండు సంవత్సరాలుగా ప్రెస్ కౌన్సిల్ పత్రికా రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యల గురించి ప్రతి నవంబరు 16న సెమినార్లు నిర్వహిస్తున్నది. అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటనలోని 19 ఆర్టికల్‌కు అనుగుణంగా పాలకులు పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, వారికి పత్రికా స్వేచ్ఛ ప్రాధాన్యతను గుర్తు చేస్తూ ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ దినంగా మే 3వ తేదీని ప్రకటించింది.
మన దేశములో వార్తాపత్రికలు ప్రారంభమైన తొలిరోజుల్లో ‘ గెజిట్ ‘ తన మోటో గా ఒక చక్కని వాక్యం పచురించింది
. ” మాది ఒక రాజకీయ , వ్యాపార పత్రిక … అన్ని రాజకీయ పార్టీలకు స్థానము కల్పిస్తాం కాని ఏ రాజకీయ పార్టీ ప్రభావానికి లోను కాము ” అన్న నాటి గెజిట్ లక్ష్యమే నేటికీ పత్రికలకు ఆదర్శము గా నిలుస్తుంది . ప్రాంతీయ భాషలలో కొన్ని పత్రికలు కొన్ని పార్టీల కొమ్ము కాసేవిగా ముద్రపడ్డాయి . అయితే అటువంటి రాజకీయ ముద్ర ఆయా పత్రికల ఎదుగుదలను ఏదో ఒక సమయం లో దెబ్బతీస్తుంది . రాజకీయ పార్టీలు తమ సిద్ధాంత ప్రచారానికి తమ కంటూ సొంత పత్రికలు ఉండాలని భావించాయి. కొన్ని సంస్థలు పత్రికల్ను నిర్వహిస్తున్నాయి .
పత్రికలలో పెద్ద పీట రాజకీయ పత్రికలదే . ప్రాంతీయ భాషలలో పత్రికలకు అధిక ఆదరణ ఉండడం గమనించిన జాతీయ స్థాయి పత్రికలు ప్రాంతీయ ఎడిషన్లను ప్రారంభంచాయి. ఇండియా టుడే , సండే ఇండియన్ వంటి ఆంగ్ల పత్రికలు దక్షిణాది భాషలలో కూడా తమ ప్రచురణలు మొదలు పెట్టాయి . దేశ రాజధాని అయిన ఢిల్లి నగరం నుంచి పలు ప్రాంతీయ భాషా వార్తాపత్రికల ప్రచురణ ప్రారంభమైంది . ఢిల్లిలో మొత్తం 15 భాషలలో వార్తాపత్రి కలు వస్తున్నాయి.భారతదేశ జనాభాలో పత్రికలు చదివే పాఠకులు 20 శాతమే ఉన్నారు . అందులో కేవలం 10 శాతము మంది మాత్రమే పత్రికలను కొని చదువుతారు . మిగిలినవారు పత్రికలను పంచుకొని లేదా లైబ్రరీలలో చదువుతుంటారు .
కొవిడ్ కారణం గా పత్రికా రంగం తీవ్రం గా ధెబ్బ తింధి.పాటకులు పత్రికలు ఇంటికి వేయించుకొవడం తగ్గింది.పేజీలు కూడా థగ్గినాయి.ఆన్ లైన్ లో పత్రికలు చదివే వారి సంక్య పెరిగింది. పెద్ద పత్రికల ధరలు కూడా సుమారు యేడు రూపాయలు వుంది. పత్రికలను కొని చదివే అలవాటు తెలుగువారిలో తక్కువగా ఉండడం భాధాకరమైన విషయమే. తమిళనాడు లో పత్రికలు కొని చదివే అలవాటు ఎక్కువ అవడం మూలాన పత్రికా రంగం బలము గా స్థిరము గా ఉంది . ఇక్కడ పత్రికలు ఇతర భాషలపత్రికలకన్న తక్కువ ధరకే అందించగలుగుతున్నాయి.
మన దేశ పత్రిక పాఠకుల సంఖ్య 25 కోట్లు పైనే ఉంటారు అని అంచనా . ప్రపంచం మిగతా ప్రాంతాలలో పాఠకుల సంఖ్య తగ్గుతుంటే భారత్ లో ఏటా 10 శాతము వంతున పెరుగుతుంది . ఇది పత్రికారంగానికి , పాఠకులకు ఆనందం కలిగించే విషము . వార్తా ప్రసారరంగం లో పత్రికలదే పైచేయి అనే విషయము వాణిజ్య ప్రకటనారంగం కూడా నిర్ధారిస్తుంది . మిగిలిన ఎన్ని రకాలుగా వ్యాపార ప్రకటనలు విడుదల చేసినా వినియోగదారుడి మీద ప్రభావం చూపేది మాత్రం పత్రికా ప్రకటనలే అని వారు భావిస్తున్నరు . పత్రికల్లో ప్రకటనలు ఒకటికన్నా ఎక్కువసార్లు పాఠకుల దృష్టిని ఆకర్షిస్తుంది . అందుకే అడ్వర్టైజింగ్ బడ్జెట్ లో పత్రికా ప్రకటనకే ఎక్కువ కేటాయిస్తున్నారు:నేడు పత్రికలు కేవలం వార్తలు మాత్రమే అందించడం లేదు . అన్ని వర్గాలవారికి సంబంధించిన అంశాలను , క్రీడలు , విజ్ఞానం , ఆరోగ్యము , యువతకు సంబంధించిన అంశాలు మున్నగు పలు రకాల విషయాలు ప్రజకు అందిస్తున్నాయి. అది పత్రికలు సమాజానికి చేస్తున్న సేవ . విద్య , ఉపాధికి సంబంధిచిన అంశాలు ప్రత్యేకం గా అందిస్తున్నారు . ఆయా అంశాలకోసం ప్రత్యేక పత్రికలే వెలువడుతున్నాయి
. ఆరోగ్యము , మహిళా అంశాలు , సినిమా,పిల్లలకి,, హాస్యము ఇలా విడివిడిగా ప్రతి అంశాన్ని ప్రతేకంగా ప్రచురిస్తున్న పత్రికలూ ఉన్నాయి . సాంకేతిక ప్రగతిని పత్రికల తయారీలో ఉపయోగించుకుంటున్నారు.సిని పేజీలు పెట్టి వార్తలు లేకుండా చేస్తూ ఇబ్బంది కి గురి చేస్తూ వున్నారు.హత్యలు,రేపు ,మాన భంగం లాంటి వాటిని పతాక శీర్షికలో పెట్టి పాటకుల అబిప్రాయాలకి గౌరవం ఇవ్వకుండా ప్రచురిస్టూ పత్రిక విలువలకు తిలోదకాలిచ్చి పత్రికల పట్ల ద్వేషం కలిగేలా కొన్ని యాజమాన్యాలు వ్యహహ రి స్థూవున్నాయి.ప్రజా సమస్యలు వెలికి తీసెలా పత్రికలు కృషి చేయాలి.అన్ని పత్రికలను,పాత్రికేయులను గౌరవంగానే ఉంచుదాం.