జల్సాల నిలయంగా సఖి కేంద్రం
– ఎన్జీవో అధీనంలోనే సఖీ సెంటర్
– సఖి సెంటర్లో రాత్రి 9, 10 వరకు కొనసాగుతున్న పార్టీలు
– రిజిస్టర్లను మాత్రం తనిఖీ చేయనివ్వరు
– వీరు మాత్రం ఫోటోలు వీడియో లు తీసుకోవచ్చు
– ఆర్టీఐ ఆక్ట్ కు మాత్రం వీడియో లు ఫోటోలు నిషేధం
– ఇంత జరిగినా జిల్లా అధికారులు మాత్రం తనిఖీలు చేయరు.
ఇందూర్ వార్త : కామారెడ్డి ప్రతినిది, నవంబర్ 30
మహిళలకు అనుక్షణం న్యాయం చేసేందుకు, ప్రజలకు జవాబుధారగా ఉండేదుకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన సఖి కేంద్రం నేడు ఎన్జీవో గుప్పెట్లో బంది అయింది. సఖి సెంటర్ నిర్వాహనను ప్రభుత్వం ఎన్జీవో సంస్థలకు అప్పగిస్తుంది, దీనిని ఆసరాగా చేసుకున్న కొందరు ఎన్జీవో నిర్వాహకులు తమ ఇష్టం వచ్చినట్లుగా డబ్బుల్ని వృధా చేస్తున్నారు . సఖి సెంటర్లో పనిచేసే సిబ్బంది ఎన్జీవోలు చెప్పినట్లుగా వినవలసిన పరిస్థితి నెలకొంది. వారికి ఎందులోనూ స్వేచ్ఛ లేదు. సఖి సెంటర్లో పలు అవకతవకల జరిగినట్లు పట్టణ ప్రజలకు తెలియడంతో ఒకరిద్దరు సఖి సెంటర్ ఖర్చుల వివరాలు తెలిపాలంటూ సమాచార హక్కు చట్టం ద్వారా కోరారు. మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి రిజిస్టర్లను తనిఖీ చేసుకోవడానికి అనుమతి ఇచ్చిన ఎన్జీవో మాత్రం అనుమతి ఇవ్వడం లేదు. సదరు సమాచార హక్కు చట్టం కింద రిజిస్టర్ వెరిఫికేషన్ కు వెళ్ళగా సఖి సెంటర్లో పనిచేసే సిబ్బంది ఎన్జీవో అనుమతి ఇవ్వలేదని ఫోటోలు, వీడియోలు తీయరాదని, ఒక్కరు మాత్రమే వెళ్లాలని అది సాయంత్రం లోపే వెళ్లాలని పలు నిబంధనలు పెట్టారు. చివరికి వారికి రిజిస్టర్ లను చూపనేలేదు.
సఖి సెంటర్లో రాత్రిపూట జల్సాలు చేస్తున్న వైనం..
రిజిస్టర్ తనిఖీ చేయడానికి జిల్లా అధికారి పర్మిషన్ ఇచ్చిన వెరిఫికేషన్ చేసుకునేందుకు వెళ్లిన వారిని మాత్రం సఖి సెంటర్ సిబ్బంది లోనికి అనుమతించడం లేదు, కానీ ఎన్జీఓ చైర్మన్ మరియు సీ డబ్ల్యు సి చైర్మన్ బర్త్ డే ను సిబ్బంది మాత్రం రాత్రిపూట బర్తడే పార్టీలు చేసుకుంటున్నారు. జల్సాలకు మాత్రం ఎన్జీవో అనుమతి ఎలా ఇచ్చారు. అని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎన్జీవో ఎలాంటి అవకతవకలు చేయకుంటే రిజిస్టర్ చూపించడానికి భయం ఎందుకనే విషయం ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.