ఇందూర్ వార్త ప్రతినిధి గౌతమ్
జనవిజ్ఞాన వేదిక,తిరువూరు ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాలుగా నాగార్జున పాఠశాల లో నిర్వహిస్తున్న వైద్య శిబిరానికి తిరువూరు మరియు పరిసర జిల్లాలైన కృష్ణా,ఖమ్మం జిల్లాలనుండి కూడా 950 మంది హాజరయ్యారు.వీరికి రెండు నెలలకు సరిపడ మందులను అందచేశారు.ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ బి.పి,షుగర్ లు కేవలం మందుల వాడకం తోనే నియంత్రణ లో ఉండవని,సరైన ఆహార నియమాలు పాటించాలని,రోజులో రెండు సార్లు మాత్రమే ఆహారం తీసుకోవాలని, ఒక్కపూట తప్పనిసరిగా తృణ ధాన్యాలను వాడాలని,క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని తెలియ చేశారు.ఈ కార్యక్రమంలో వైద్యులు డా.సత్య తేజ, డా.వి.రవీంద్ర, డా.లక్ష్మణరావు,డా.శివాజీ,మదర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ టెక్నాలజీ విద్యార్థులు,జనవిజ్ఞానవేదిక సభ్యులు వాలంటీర్ లుగా పాల్గొన్నారు. జనవిజ్ఞాన వేదిక నాయకులు యం.హరికృష్ణ, యం.సుధాకర్,కె.పాపారావు,కె.లక్ష్మణరావు, రాజశేఖరరెడ్డి,సాంబశివరావు,ఆంజనేయులు, నాగేశ్వరరావు నాగేంద్రప్రసాద్,సురేష్,శ్రీను,రవి ,తదితరులు పర్యవేక్షించారు






