ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు
కౌశిక్ రెడ్డీ దిష్టిబొమ్మ దగ్ధం
కౌశిక్ రెడ్డి ముదిరాజ్ విలేఖరి పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను రాష్ట్రంలో ఉన్న ముదిరాజ్ సోదరులు అందరూ రోడ్లపైకి వచ్చి నిరసన చేస్తున్నారు. మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండల కేంద్రంలో ముదిరాజ్ సోదరులు కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ముదిరాజ్ సోదరులు మాట్లాడుతూ ఏ పార్టీల వారైనా ఏ ఇతర కులస్తులైన ముదిరాజ్ సోదరులను కించపరిచే విధంగా మాట్లాడుతే ముదిరాజ్ లు అందరూ ఐక్యంగా ఉండి వారికి తగిన గుణపాఠం చెప్తామని, కౌశిక్ రెడ్డి గారిని వెంటనే టిఆర్ఎస్ పార్టీ నుండి తొలగించి . అరెస్టు చేయాలని పెద్ద మొత్తంలో ముదిరాజ్ సోదరులు రోడ్డుపై నిరసన తెలిపారు అనంతరం పోలీస్ స్టేషన్లో కౌశిక్ రెడ్డి పై కేసు నమోదు చేయడం జరిగింది .