పకృతి విపత్తుల నుంచి మానవ, వృక్ష , జంతు జాతులను కాపాడిన మహనీయుడు కౌండిన్య మహర్షి
జై గౌడ ఉద్యమం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రంగోల్ల మురళి గౌడ్
ఘనంగా కౌండిన్య మహర్షి జయంతి
ఇందూర్ వార్త వెబ్ డెస్క్
పకృతి విపత్తుల నుంచి మానవ, వృక్ష , జంతు జాతులను కాపాడిన మహనీయుడు కౌండిన్య మహర్షి అని జై గౌడ ఉద్యమం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రంగోల్లు మురళి గౌడ్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జై గౌడ ఉద్యమం కార్యాలయంలో కౌండిన్య మహర్షి జయంతి ఉత్సవాలను శుక్రవారం ఘనంగా నిర్వహించి మాట్లాడారు .దేశవ్యాప్తంగా కౌండిన్య వారసులు పర్యావరణ రక్షణకై, ప్రజారక్షణకై నిరంతరం పోరాడుతున్నారు అని అన్నారు.
కౌండిన్య ధర్మం ప్రకారం గౌడ్ లంతా పర్యావరణ పరిరక్షణకు, మానవ ధర్మ పరిరక్షణకు, బహుజన వర్గాలంతా ఐకమత్యంగా ఉండేలా కృషి చేయాలని రంగోల మురళి గౌడ్ అన్నారు.కౌండిన్య జయంతిని వాడవాడలా నిర్వహించి కౌండిన్య ధర్మాన్ని ప్రచారం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గౌడులంతా గౌడ జాతి ఆవిర్భావ దినోత్సవం కార్తీక పౌర్ణమినాడు జరుపుకోవడం ఆనవాయితీ అని, తాటి ఈత వన సమారాధన, కాటమయ్య పండుగలు జరుపుకోవడం గౌడుల ధర్మమని గౌడ సంఘాల నేతలు గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సైదా గౌని వెంకట్ గౌడ్ జై గౌడ ఉద్యమం జిల్లా నాయకులు ఇందూరి సిద్దా గౌడ్ .సీనియర్ విలేఖరి నర్సాగౌడ్ తాటిపాముల ప్రశాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.