ఇందూర్ వార్త కల్లూరు ప్రతినిధి
మండల పరిధిలో ముగ్గు వెంకటాపురం గ్రామ పంచాయతీ లో మంగళవారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పిట్టల విశ్వనాధం, రావి పాపారావు, చింతకాయల పుల్లారావు,చిలకా మునిబాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ శాఖ అధ్యక్షులుగా కల్లేపల్లి రమేష్,ఉపాధ్యక్షులుగా మెరుగు వీరబద్రరావు,ప్రధాన కార్యదర్శిగా తిరుమల శెట్టి రాఘవ రావు, కోశాధికారిగా ఎక్కిరాల కృష్ణ, సహాయ కార్యదర్శులుగా చింతకాయల మారేష్,వాసం వెంకటేశ్వర రావు, కార్యవర్గ సభ్యులు 16మందిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాపై నమ్మకంతో మాకు అప్పజెప్పిన బాధ్యతను కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని శక్తి వంచన లేకుండా పనిచేస్తామని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గడపగడపకు ప్రచారం చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేస్తామని అన్నారు. ఈ అవకాశం కల్పించిన
నియోజకవర్గం ఎమ్మెల్యే మట్టా రాగమయి రాష్ట్ర నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్, గ్రామ కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.