ఎంఎస్ఎన్ కంపెనీ వ్యర్థ పదార్థాలు కాచాపూర్ గ్రామ పెద్ద చెరువులోకి వస్తున్నాయనిఎం ఎస్ ఎన్ కంపెనీ యొక్క వ్యర్థ పదార్థాలుతీ ముందు గ్రామ ప్రజలు ధర్నా రాస్తారో,
కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన పెద్ద చెరువులో చేప పిల్లలు ఆ నీరు త్రాగడం వలన గేదెలు కూడా చనిపోవడం జరుగుతుందని, కంపెనీ విషయంపై గ్రామపంచాయతీ గ్రామ వద్ద సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు, ఎం ఎస్ ఎన్ కంపెనీ యొక్క వ్యర్థ పదార్థాలు బయటకు రావద్దని కంపెనీ యజమానికి పలుమార్లు చెప్పిన పట్టించుకోవడంలేదని కాచాపూర్ గ్రామానికి చెందిన విడిసి గ్రామ అధ్యక్షులు మర్రి మైపాల్ రెడ్డి ,తిరుమల్ రెడ్డి, కిష్టారెడ్డి ,దశరథం ,నంద గౌడ్ ,దుబ్బ రాజం తెలిపారు, ఎంఎస్ఎన్ కంపెనీ వలన ప్రాణాష్టం ఉందని గ్రామంలోని అన్ని కులాల అధ్యక్షుల కార్యదర్శిలతో గ్రామ ప్రజలతో సమావేశం నిర్వహించుకోవడం జరిగిందని తెలిపారు, ఇప్పటికైనా ఎంఎస్ఎన్ కంపెనీ వ్యర్థ పదార్థాలు బయటకు రాకుండా చూసుకోవాలని బయటకు వచ్చినట్లయితే కంపెనీ మూసివేసే వరకు కోర్టుకెళ్తామని తెలిపారు. ఇంతకుముందు కంపెనీ లోపల కంపెనీ బయట చెరువులో వ్యర్థ పదార్థాలు ల్యాబ్ పంపితే తెలంగాణ పొల్యూషన్ కాంట్రిబ్యూషన్ 12 రకాల ల్యాబ్ టెస్టులు చేయగా అందులో ఏడు రకాల భయంకరమైనటువంటి ఏడు రకాల రిపోర్ట్స్ ఉన్నాయని అన్నారు. వాటి వలన రాబోయేv కాలంలో గ్రామ ప్రజలకు అంగవైకల్యం వివిధ రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు, వెంటనే ఎంఎస్ఎన్ కంపెనీ నుండి వచ్చే వ్యర్థ పదార్థాలను ఆపాలని డిమాండ్ చేశారు. లేకపోతే కంపెనీ మూసే వేసే అంతవరకు ధర్నాలు రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు.