ఇందూర్ వార్త : వెబ్ డెస్క్ బుధవారం
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నా గౌడ కులస్తులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. హైదరాబాదులోని గాంధీభవన్లో టీపీసీసీ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ ను జై గౌడ ఉద్యమం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రంగోల్ల మురళి గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాటమయ్య రక్షణ కిట్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం గౌడ కులస్తులకు రక్షణ కల్పించిందన్నారు. అర్హులైన గీతా కార్మికులందరికీ లైసెన్సులు ఇప్పించాలని వారు టిటిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను కోరగా వెంటనే స్పందించిన ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఏలాంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకువస్తే సమస్యల సాధన కోసం తాను నిరంతరం కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జై గౌడ ఉద్యమం రాష్ట్ర నాయకురాలు అనురాధ గౌడ్ జై గౌడ ఉద్యమం జిల్లా ప్రధాన కార్యదర్శి అంకన్న గారి శ్రీనివాస్ గౌడ్ ఉపాధ్యక్షులు ప్రశాంత్ గౌడ్ ,శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు