ఇందూర్ వార్త కల్లూరు ప్రతినిధి గౌతమ్
కల్లూరు మండలంలోని
బత్తులపల్లి గ్రామంలో పశుసంవర్ధక శాఖ మరియు పశుగణాభివృద్ధి సంస్థ సంయుక్తంగా నిర్వహించిన గోపాలమిత్ర ఉచిత పశువైద్య శిబిరాన్ని మండల పశువైద్యాధికారి డా. కె. మమత ప్రారంభించారు. ఈ శిబిరంలో గర్భకోశ వ్యాధులకు సంబంధించి 38 పశువులకు చికిత్స చేసినట్లు,56 దూడలకు నట్టల నివారణ మందులు తాగించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డా. మమత మాట్లాడుతూ చలికాలం ప్రారంభమైందున గేదెలు ఎక్కువగా ఎదకు వస్తాయని, పశువులు ఎదకు వచ్చినప్పుడు అరవడం, బెదురుగా చూడడం, చిరు మూత్రం పోయడం, పలుచని తీగలు వేయడం లాంటివి చేస్తాయని, పాడిరైతులు సకాలంలో ఎదను గుర్తించి సమీప పశువైద్యశాలలో గాని గోపాల మిత్రులచే గాని కుత్రిమగర్భధారణ చేయించాలని తద్వారా మేలుజాతి పశు సంతతిని పొందవచ్చునని రైతులకు సూచించారు.ఈ కార్యక్రమంలోని వీఎల్ఓ శ్రీనివాసరావు, గోపాలమిత్ర సూపర్వైజర్ తుమ్మల వెంకటేశ్వర్లు, నాగిరెడ్డి, ఖమ్మం పాటి అప్పారావు కృష్ణ ప్రసాద్, బి వెంకటేశ్వర్లు ,పి వెంకటేశ్వర్లు విజయ్ కుమార్ మరియు గ్రామంలో ఉన్న రైతులు పాల్గొన్నారు