ఇందూర్ వార్త (వెబ్ న్యూస్)హైదరాబాద్ :ప్రతినిధి
హైదరాబాద్:సెప్టెంబర్ 03
గాంధీభవన్లో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ పీఈసీ కీలక సమావేశం నిర్వహిస్తోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం సాయంత్రం ఈ భేటీ జరుగుతోంది. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థుల నుంచి టీ కాంగ్రెస్ దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. అన్ని నియోజకవర్గాల నుంచి ఇటీవల దరఖాస్తులు స్వీకరించగా.. నేతలు భారీగా పోటీ పడ్డారు. కొన్ని నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి.
దాదాపు మొత్తం 1006 దరఖాస్తులు వచ్చాయి. అభ్యర్థుల నుంచి వచ్చిన దరఖాస్తులను పీఈసీ పరిశీలించనుంది. ఈ మేరకు ఒక నివేదికను సిద్దం చేసి స్క్రీనింగ్ కమిటీకి అందజేయనుంది. వీలైనంత త్వరగా అభ్యర్థులను ఖరారు చేయాలని టీ కాంగ్రెస్ భావిస్తోంది. అందులో భాగంగా గాంధీ భవన్లో వరుస సమావేశాలు జరుగుతున్నాయి.
అభ్యర్థుల ఎంపికపై వేగంగా కసరత్తులు చేస్తున్నారు. వచ్చే నెలలో తొలి జాబితాను ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది. బీఆర్ఎస్కు ధీటైన అభ్యర్థులను అన్ని నియోజకవర్గాల్లో బరిలోకి దింపాలని కాంగ్రెస్ భావిస్తోంది.
ఇప్పటికే బీఆర్ఎస్ 115 అభ్యర్థులతో జంబో జాబితాను ప్రకటించింది. దీంతో వీరికి పోటీగా ఎవరైతే బాగుంటుంది..? ఎవరైతే బలంగా పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది..? అనే విషయాలను అంచనా వేసి టికెట్లను కేటాయించనున్నారు.
ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అభ్యర్థుల ఎంపిక క్రమంలో ఇవాళ గాంధీభవన్లో జరుగుతున్న సమావేశం కీలకంగా మారింది. ఇఫ్పటికే 25 నియోజకవర్గాల్లో అభ్యర్థులపై క్లారిటీ వచ్చింది. దీంతో మిగతా 94 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొనసాగుతోంది. దరఖాస్తులను పీఈసీ సభ్యులు స్క్రూటినీ చేయనున్నారు…కసరత్తులు చేస్తున్నారు. వచ్చే నెలలో తొలి జాబితాను ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది.
బీఆర్ఎస్కు ధీటైన అభ్యర్థులను అన్ని నియోజకవర్గాల్లో బరిలోకి దింపాలని కాంగ్రెస్ భావిస్తోంది.
ఇప్పటికే బీఆర్ఎస్ 115 అభ్యర్థులతో జంబో జాబితాను ప్రకటించింది. దీంతో వీరికి పోటీగా ఎవరైతే బాగుంటుంది..? ఎవరైతే బలంగా పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది..? అనే విషయాలను అంచనా వేసి టికెట్లను కేటాయించనున్నారు.
ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అభ్యర్థుల ఎంపిక క్రమంలో ఇవాళ గాంధీభవన్లో జరుగుతున్న సమావేశం కీలకంగా మారింది. ఇఫ్పటికే 25 నియోజకవర్గాల్లో అభ్యర్థులపై క్లారిటీ వచ్చింది. దీంతో మిగతా 94 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొనసాగుతోంది. దరఖాస్తులను పీఈసీ సభ్యులు స్క్రూటినీ చేయనున్నారు…