*గర్భిణీ మహిళకు రక్తధానం చేసిన రక్తధాత*
*రక్తధాతల సేవా సమితి*
నిర్వాహకులు
*బోనగిరి శివకుమార్*
*ముదాం శ్రీధర్ పటేల్*
కామారెడ్డి ఫిబ్రవరి 25ఇందూర్ వార్త ప్రతినిధి
కామారెడ్డి పట్టణంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రష్మిక (27) అనే గర్భిణీ పేషంట్ కి అత్యవసరంగా ఆపరేషన్ నిమిత్తమై ఏబి పాజిటివ్* రక్తం అవసరం ఉండగా వారి కుటుంబ సభ్యులు కామారెడ్డి జిల్లా రక్తదాతల సేవా సమితి* నిర్వహకులను
సంప్రదించడంతో కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని లింగాపూర్ గ్రామానికి చెందిన కాసార్ల దేవరాములు* గారి సహకారంతో వారికి కావాల్సిన ఏబి పాజిటివ్ రక్తం అందజేయడం జరిగింది.ఒక్క ఫోన్ కాల్ చేయగానే మానవతా ధృక్పతంతో స్పందించి రక్తధానంకు ముందుకు వచ్చిన రక్తదాతను జిల్లా రక్తదాతల సేవా సమితి* నిర్వాహకులు బోనగిరి శివకుమార్, ముదాం శ్రీధర్ పటేల్* గార్లు అభినందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కూతడి ఆంజనేయులు,వి టి ఠాకూర్ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్, యేసుగౌడ్,చందన్ లు పాల్గొనడం జరిగింది.