క్రిస్మస్ దుస్తుల పంపిణీ
ఇందూర్ వార్త
బీర్కూర్ 20 డిసెంబర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ పండుగ పురస్కరించుకొని క్రిస్టియన్ కుటుంబాలకు దుస్తులు పంపించేసే కార్యక్రమాన్ని బీర్కూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ టీ రఘు చేతుల మీదుగా అందజేశారు. ప్రతి సంవత్సరం క్రిస్టియన్ కుటుంబాలకు దుస్తులు పంపిణీ చేసే కార్యక్రమం కొనసాగుతుంది. కార్యక్రమంలో ఎంపీడీవో భాను ప్రకాష్, ఎమ్మార్వో రాజు, మాజీ జెడ్పిటిసి సభ్యులు ద్రోణవల్లి సతీష్, బీర్కూర్ గ్రామ రైతు సమితి అధ్యక్షులు అవారి గంగారం, జడ్పిటిసి స్వరూప, కిష్టాపూర్ సర్పంచ్ పుల్లేని బాపూరావు, అన్నారం సర్పంచ్ కిష్టారెడ్డి, ప్రజా ప్రతినిధులు, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.