ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు
•ముఖ్యఅతిథిగా హాజరైన నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి
• పెండింగ్లో ఉన్న పనులన్నీ సకాలంలో పూర్తి చేయాలి •
• సమావేశం ద్వారా అధికారులకు సూచనలు •
• బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో పార్టీ కోసం కష్టపడి గ్రామాల అభివృద్ధి కోసం కృషిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి పేరుపేరునా కృతజ్ఞతలు •
• పదవి కాలం ముగియడంతో సర్పంచ్లకు ఎంపిటిసి లకు జడ్పిటిసి లకు ఘన సన్మానం •
మెదక్ జిల్లా కౌడిపల్లి లో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోఎంపీడీవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నర్సాపూర్ నియోజకవర్గ శాసన సభ్యులు ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి హాజరయ్యారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, పార్టీ కోసం కష్టపడి గ్రామ అభివృద్ధికి తోడుపడ్డ ప్రతి ఒక్క కార్యకర్త కి అభినందనలు తెలియజేశారు, రాబోయే ఎన్నికల్లో మీరు మరింత ఉన్నత స్థాయికి చేరాలని కోరారు. గ్రామాల్లో ఉన్న సమస్యలు పూర్తిస్థాయిలో కానీ పనులు ఏవైనా ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు. అధికారులు కూడా సమస్యలపై స్పందించి వెంటనే పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తిస్థాయిలో నిర్వహించేందుకు కృషి చేస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కవిత అమర్ సింగ్,ఎంపీపీ రాజు నాయక్, మండల అధ్యక్షుడు సారా రామ గౌడ్, తాజా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ సెక్రటరీలు, ఆయాశాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.