- ఇందుర్ వార్తా ప్రతినిధి రాజు
- 51 జీవో ప్రకారం మల్టీ పర్పస్ విధానం ద్వారా అన్ని రకాల పనులు చేయాలని నిబంధనలు పెట్టింది
- గ్రామపంచాయతీ కార్మికుల పనితీరును చూసి సమ్మెలో భాగంగా కౌడిపల్లి యువసేన ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
- వారికి ఎల్లప్పుడూ యువసేన అందుబాటులో ఉంటుందని తెలియజేశారు
గ్రామపంచాయతీ యొక్క పనితీరులు
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని కౌడిపల్లి మండలంలో గ్రామపంచాయతీ కార్మికుల రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా నాలుగవ రోజు కారోబార్
ఎల్లం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులు పట్ల అనైతికంగా వ్యవహరిస్తుందని కార్మికులు అన్నారు తెలంగాణ వచ్చాక ఎన్నడూ లేని విధంగా 8500/- జీతం ఇచ్చి మా యెక్క జీవితం లో వెలుగులు నింపిన. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కృతజ్ఞతలు
కానీ ఇప్పుడు. ఏ ప్రభుత్వ ఉద్యగికీ లేనట్టు గ్రామపంచాయతీ కార్మికులకు మాత్రమే 51 జీవో ప్రకారం మల్టీ పర్పస్ విధానం ద్వారా అన్ని రకాల పనులు చేయాలని నిబంధనలు పెట్టింది దాని వల్ల చాలా మంది కార్మికులు కరెంట్ షాక్ తో చనిపోయినారు… డ్రైవింగ్ రాక ట్రాక్టర్ బోల్తాపడి చాలా మంది చనిపోయారు.
వారి కుటుంబాల్లో చీకటి నిండింది. కరోనా వైరస్ కాలంలో ప్రాణాలుకు తెగించి ముందుండి మీకు తగిన సేవలు అందించాం కనీస వేతనం అమలు చెయ్యకపోవడంతో కుటుంబం పోషన భారంగా మారింది నిత్యావసర ధరలు కూడా పెరగడం వలన చాలా కుటుంబాల్లో రోడ్డున పడ్డారు, ఐనా కూడా మేము మురికి కాలువలో శుభ్రం చేస్తున్నాము దీని వలన ఆరోగ్య ప్రయోజనాలు (భీమా) లేకా చాలా మంది ఆనారోగ్యంతో హాస్పిటల్ లో చూపించుకుంటున్నారు సామాజికంగా వెనుకబడి పోయారు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కనీస వేతనం అమలు చేయాలనీ,ప్రతి సంవత్సరము జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డులు రావడానికి ఎంతగానో కష్టపడినాము గ్రామ అభివృద్ధిలో మా వంతు పాలు పంచుకున్నాం. ఇన్నీ రోజులుగా గ్రామ గ్రామనికి ఎంతో సేవ చేసిన ఏ గ్రామ పంచాయతీ కూడా సరిగ్గా పట్టించుకోవడం లేదు
గ్రామ రూపురేఖలు మార్చి ప్రతి ఒక్కరి కుటుంబంలో సంతోషాన్ని చూడడమే లక్ష్యంగా పనిచేస్తూ ముందుకు సాగుతున్నాం ప్రజలందరితో కుటుంబ సభ్యునిగా కలిసి ఉన్నాం ఈరోజు సమ్మె నిర్వహిస్తున్న ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్పందన లేకపోవడంతో చాలా బాధాకరంగా ఉందని అయినా గ్రామాలలో గ్రామపంచాయతీ కార్మికుల పనితీరును చూసి సమ్మెలో భాగంగా కౌడిపల్లి యువసేన ఆధ్వర్యంలో వారికి పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు వారికి ఎప్పటికైనా తోడుగా ఉంటామని యువసేన అధ్యక్షులు పోల నవీన్ కుమార్, ఉపాధ్యక్షులు సందీప్ కుమార్, మురళి, జనరల్ సెక్రెటరీ యూసుఫ్, కోశాధికారి మహేష్, ప్రధాన కార్యదర్శి గుడ్డంల రాజు, వీరితో పాటు యువసేన సభ్యులు రాజశేఖర్ గిరి కళ్యాణ్ నవీన్ తదితరులు పాల్గొన్నారు