- ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గమైన కౌడిపల్లి మండలంలోని తునికి పోచమ్మ టెంపుల్ ఆవరణలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ తొమ్మిది సంవత్సరాల పాలన సందర్భంగా మహా జన సంపర్క్ యోజన సందర్భంగా బిజెపి కిసాన్ మోర్చా మెదక్ జిల్లా ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ రైతు పథకాల లబ్ధిదారుల సమ్మేళనం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బిజెపి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు జనగామ మల్లారెడ్డి గారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇస్తున్నటువంటి సబ్సిడీలను మరియు కిసాన్ సమాన్ నిధి వివరించడం జరిగింది మరియు సాహెల్ హెల్త్ కార్డు గురించి వివరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు వెల్మకన్న సర్పంచ్ ఖాజిపేట రాజేందర్, బిజెపి మండల అధ్యక్షులు రాకేష్ కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు సత్యనారాయణమండల ఇంచార్జ్ గోడ రాజేందర్, , మండలం అధ్యక్షులు రాకేష్, మండలం ప్రధాన కార్యదర్శి కుమార్,మండలం ఉపాధ్యక్షులు సురేష్, మండలం కోశాధికారి సతీష్sc మోర్చా మండలం ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ ,కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు సత్యనారాయణ, మండలం కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు గోల కిష్టయ్య,రైతులు సండ్రు సత్యనారాయణ,కొన్యాల మలేష్, కుమారి సత్యనారాయణ లు పాల్గొన్నారు.