ఇందూర్ వార్త / సెప్టెంబర్ 18 / కోటగిరి/ పోతంగల్.
కోటగిరి మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.కోటగిరి మండల కేంద్రంలోని ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజుతో కలిసి శుక్రవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అన్నారు.ధాన్యం దళారులకు తక్కువ ధరకు అమ్మి రైతులు నష్టపోవద్దన్నారు. ఎకరానికి 500 రూపాయలు బోనస్ గా ఇస్తుందని సూచించారు. వారంలోగా రైతు ఖాతాలో డబ్బులు జమ అవుతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతు,సొసైటీ చైర్మన్ కూచి సిద్దు, ఏఓ శ్రీనివాస్ మాజీ జెడ్పిటిసి శంకర్ పటేల్, మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్,కాంగ్రెస్ నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.