కులగణన సర్వేపై మాకు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి
ఆదివాసి నాయకులు తంబళ్ల రవి
ఇందూర్ వార్త నవంబర్ 10 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి
అశ్వరావుపేట నియోజకవర్గం ఆదివాసీ నాయకులు తంబల్ల రవి మాట్లాడుతూ
కులగణన సర్వే పై మాకు పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని
ఏజెన్సీ ప్రాంతంలో ఇతర కులస్తులు దొంగ ఎస్టీ సర్టిఫికెట్లు పొందిన వారు చాలామంది ఉన్నారని
ఖరీదైన కార్లు,బంగ్లాలు,వందల ఎకరాలు ఉన్నవారు కూడా లక్షల్లో ఆదాయం ఉందని మరియు తక్కువ భూములు ఉన్నవి అని చూపిస్తున్నారని సమాచారం…?
ఏజెన్సీ ప్రాంతంలో సర్వే వివరాలు పంచాయతీ ఆఫీసులో ఓపెన్ గా బహిర్గతం చేయాలనీ డిమాండ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తున్నటువంటి కులగణన సర్వే ఏజెన్సీ ప్రాంతంలో కొంతమంది ఇతర కులస్తులు దొంగ ఎస్టీ సర్టిఫికెట్లుతొ లబ్ధి పొందుతున్నరు,వారిని వెలికి తీయాలి,వందల ఎకరాలు,ఖరీదైన కార్లు,బంగ్లాలు ఉన్నవారు కూడా లక్షల్లోనే ఆదాయం ఉందని మరియు భూములు తక్కువగా ఉన్నవని చూపిస్తున్నారని సమాచారం…? కావున మేం కోరుతున్నది ఒకటే ప్రతి పంచాయతీ ఆఫీస్ లో సర్వే చేసిన పూర్తి వివరాలు ఓపెన్ గా ప్రజలకు అందుబాటులో ఉంచాలని అప్పుడు దొంగ ఎవరో దొర ఎవరో తెలుస్తుందని అశ్వరావుపేట ఆదివాసి నాయకులు తంబల్ల రవి డిమాండ్ చేశారు.