అంబర్పేట్ : బాగ్ అంబర్ పేట్ డివిజన్ కుమ్మరిబస్తీలో జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్బంగా బాగ్ అంబర్ పేట్ డివిజన్ కార్పొరేటర్ పద్మ వెంకట్ రెడ్డి, జిహెచ్ఎంసి ఎంటమాలజీ డిపార్ట్మెంట్ సూపర్వైజర్ రాఘవేంద్రతో కలిసి ఇంటి ఇంటికి తిరుగుతూ దోమల నివారణ కొరకు తీస్కోవలసిన జాగ్రత్తలు వివరిస్తూ అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ దోమల నివారణకు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని,నీటి నిల్వలు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, చిన్నపాటి జాగ్రత్తలతో డెంగ్యూ బారిన పడకుండా చూసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బిజెపి అధ్యక్షులు చుక్క జగన్,బిజెపి నాయకులు రమేష్ ముదిరాజ్,స్వామి,దేవరప్పల లక్ష్మణ్, శ్రీశైలం, నాగలక్ష్మి, వర్క్ ఇన్స్పెక్టర్ రవి నాయక్, వారితో పాటు జిహెచ్ఎంసి అధికారులు పాల్గొన్నారు.
Monday, December 23
Trending
- ఏజెన్సీ ప్రాంతాల్లో గౌడులకు న్యాయం చేయండి
- ఉచిత సిద్ధ వైద్య శిబిరాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్
- ఆదివాసీ విద్యార్థుల ఉన్నత విధ్య కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలి
- ఘనంగా పాడి కౌశిక్ రెడ్డి జన్మదిన వేడుకలు.
- పృధ్వీరాజ్ చౌహాన్ విగ్రహ ప్రతిష్టకు స్థలం కేటాయించాలి
- అమిత్ షా ను అరెస్టు చేసి బర్తరఫ్ చేయాలి:
- తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవ సంస్థ ఆధ్వర్యంలో
- అమిత్ షా ,పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు..!